రకుల్ ప్రీత్ కెరీర్ స్టార్టింగ్ లో బబ్లీగా అందంగా కనిపించేది. కానీ ఫిట్ నెస్ మంత్ర తలకెక్కాక రకుల్ ప్రీత్ మరీ సన్నగా మారిపోయింది. బబ్లీగా ఉన్నప్పటికీ రకుల్ ప్రీత్ బరువుగా ఎప్పుడు కనిపించలేదు. కానీ జిమ్, యోగా వెంట పరుగులు తీసాక రకుల్ ప్రీత్ లో చాలా మార్పులొచ్చాయి.
మొదటి నుంచి గ్లామర్ కి ఇంపార్టన్స్ ఇచ్చే రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో కి చాలా దగ్గరగా, యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా రకుల్ ప్రీత్ మేకప్ వేసుకుంటూ రెడీ అవుతున్న పిక్స్ తో పాటుగా అదిరిపోయే అవుట్ ఫిట్ లో ఉన్న ఫొటోస్ వదలగానే వావ్ రకుల్.. స్టన్నింగ్ లుక్ అదిరింది అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Parde ke peeche 🖤అంటూ క్యాప్షన్ పెట్టి మరీ రకుల్ ప్రీత్ ఆ పిక్స్ పోస్ట్ చేసింది. అయితే కొన్ని పిక్స్ లో రకుల్ మెడ దగ్గర ఎముకలు కనిపించడం చూసి బ్యూటిఫుల్, బట్ మరీ ఇంత పలచగా ఉండడం ఏం బాలేదు, జిమ్ మరీ ఎక్కువైతే కష్టం బేబీ అంటూ సరదాగా రకుల్ కి సలహాలిస్తున్నారు.