పాపం బ్లూ మీడియా మొట్టికాయలతో అయినా జగన్ లో మార్పు రావాలని అందరూ కోరుకుంటున్నా జగన్ లో మాత్రం ఏ మార్పు రావట్లేదు. ఇప్పటికి నేనిచ్చిన పథకాలివే అంటూ మాట్లాడుతున్నాడు. నేను ప్రజల కోసం పథకాలిచ్చాను, అమ్మవడి, పెన్షన్స్, రైతుబంధు ఇలా చాలారకాల సంక్షేమ పాథకాలిచ్చాను నాకే ఓట్లెయ్యాలంటూ అడుక్కున్నా ప్రజలు జగన్ కి ఓట్లెయ్యలేదు. వైసీపీ ని చరిత్రలో చెప్పుకునే విధంగా ఓడించారు.
అయ్యో పేదవారికి సంక్షేమ పథకాలిచ్చాను, అక్కాచెలెళ్లకు, అవ్వ-తాతలకు ఇంటికే పెన్షన్ పంపించాను. కానీ వాళ్ళు నాకెందుకు ఓట్లెయ్యలేదో అంటూ వాపోయిన జగన్ మోహన్ రెడ్డి ఓటమి తర్వాత తన ఓటమి గల కారణాలను విశ్లేషింసించడం మానేసి ఇప్పటికి నేను అధికారంలో ఉంటే ఈపాటికే అమ్మవడి ఇచ్చేవాడిని, రైతు బంధు వేసేవాడిని.
చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండు నెలలైంది, బడులు తెరుచుకున్నాయి.. ఇంకా అమ్మ వడి వెయ్యలేదు. రైతులు ముమ్మరంగా పనులు చేసుకుంటున్నారు. వారికీ రైతు బందు పాడేది. ప్రజలు కూడా జగన్ వస్తే బావుండేది అనుకుంటున్నారు. అమ్మవడి, రైతుబంధు వేసేవాడని అనుకుంటున్నారు. నేనైతే 15000 ఇచ్చేసేవాడిని, కానీ చంద్రబాబు 15 వేలు 18 వేలు అంటూ ఆశపెట్టి ఇవ్వడం లేదు, అదే ప్రజలు అనుకుంటున్నారు జగన్ వస్తే బావుండేది అని అంటూ చెబుతున్నాడు.
ఇప్పటికి ప్రజలు జగన్ నే సీఎం అనుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడే జగన్ ని చూసి బ్లూ మీడియా కూడా వెక్కిరిస్తుంది. జగన్ రిపీటెడ్ డైలాగ్స్, ఓడిపోయి ఇన్ని నెలలైనా జగన్ లో మార్పు రావట్లేదు అంటూ నెత్తి నోరు కొట్టుకుంది. అబ్బే జగన్ లో మార్పు రాదని బ్లూ మీడియానే ఫిక్స్ అయ్యేలా కనిపిస్తుంది వ్యవహారం.