Advertisementt

శ్రీలీల, భాగ్యశ్రీకి లేని బాధ మీకెందుకు !!

Wed 07th Aug 2024 08:30 PM
sreeleela  శ్రీలీల, భాగ్యశ్రీకి లేని బాధ మీకెందుకు !!
Sreeleela, Bhagyashree pain is not there for you!! శ్రీలీల, భాగ్యశ్రీకి లేని బాధ మీకెందుకు !!
Advertisement
Ads by CJ

ఆ హీరోయిన్స్ ఇద్దరికీ లేని బాధ మీకెందుకు అంటూ దర్శకుడు హరిష్ శంకర్ ట్రోల్ చేసే వారిపై ఫైర్ అయ్యాడు. మిస్టర్ బచ్చన్ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా హరీష్ శంకర్ ని చాలామంది కెలుకుతున్నారు. ముందుగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోపక్క డబుల్ ఇస్మార్ట్ పై పోటీకి వెళ్లడం అవసరమా అని అడుగుతున్నారు. 

తాజాగా వయసులో పెద్దవాడైన హీరో రవతేజ.. ధమాకాలో శ్రీలీల, మిస్టర్ బచ్చన్ లో భాగ్యశ్రీ బోర్సే తో రొమాన్స్ చెయ్యడం ఎంతవరకు కరెక్ట్, తనకన్నా వయసులో ఎంతో చిన్నవాళ్ళైన హీరోయిన్స్ తో రవితేజ అలా ఎలా చేస్తాడని ప్రశ్నించిన వారికి హరీష్ ఓ రేంజ్ లో సమాధానమిస్తున్నాడు. 

హీరో కి ఎంత ఏజ్ ఉంటే అంత ఏజ్ ఉన్న కేరెక్టర్స్ చెయ్యరు కదా, హీరోలకి స్క్రీన్ ఏజ్ ఉంటుంది. అభిమానులకి నచ్చేలానే హీరోలని చూపిస్తాం. దానికి తగ్గట్టుగానే హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకుంటాము. హీరో ఏజ్ కి తగినట్లుగా హీరోయిన్స్ ఏజ్ ఉండాలని చూడము కదా..  రవితేజ తో నటించేందుకు ఒప్పుకున్న హీరోయిన్స్ శ్రీలీల, భాగ్యశ్రీకి లేని బాధ మీకెందుకు, అవన్నీ మర్చిపోయి ఈ ట్రోలింగ్ ఎందుకు అంటూ హరీష్ శంకర్ ట్రోలర్స్ కి ఓ రేంజ్ ఆన్సర్ ఇచ్చాడు. 

Sreeleela, Bhagyashree pain is not there for you!!:

Mr. Bachchan age gap backlash – Harish Shankar gives clarity

Tags:   SREELEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ