ఒక భాషలోని ఇద్దరు స్టార్ హీరోలు కలిశారంటేనే అభినులకు పిచ్చ ఆనందంగా ఉంటుంది. అదే వేరే వేరే భాషల హీరోలు మీటయితే అభిమానులకే కాదు సినిమా లవర్స్ అందరికి హ్యాపీ గానే ఉంటుంది. అలా కలిసి మాట్లాడుతూ ఫోటోలకు ఫోజులిస్తే అవి సోషల్ మీడియాలో భీభత్సంగా వైరల్ అవుతాయి.
ఇప్పుడు తంగలాన్ తో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్టార్ హీరో విక్రం కన్నడ కాంతార నటుడు రిషబ్ శెట్టి ని మీటవడం హాట్ టాపిక్ అయితే రిషబ్ శెట్టి చేసిన ఎమోషనల్ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాంతార తో ఒక్కసారిగా పాన్ ఇండియా ప్రేక్షకుల్లో పాపులర్ అయిన రిషభ్ శెట్టి విక్రం ని కలవమే కాదు ఆయన్ని కలిసినందుకు తెగ ఎగ్జైట్ అవుతున్నాడు.
తన 24 ఏళ్ళ కల సాకారమైంది అంటూ.. నేను నటుడిగా మారడానికి ఇన్స్పిరేషన్ విక్రమ్. అప్పటినుంచి నుంచి ఇప్పటికి విక్రమ్ ని కలవడం ఆ దేవుడి దయే. నేను నా దేవుడిని కలిసాను. ఈరోజు నేను చాలా లక్కీ. నాలాంటి చాలామంది ఆర్టిస్ట్ ల్లో విక్రమ్ స్ఫూర్తి నింపుతున్నారు. ఆ విషయంలో విక్రమ్ సర్ కి థాంక్స్ చెప్పాలి. లవ్ యు విక్రమ్ సర్ అంటూ రిషబ్ శెట్టి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.