గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్. పోస్ట్ ప్రొడక్షన్ లో భాగంగా దర్శకుడు శంకర్ గేమ్ ఛేంజర్ డబ్బింగ్ పనులు మొదలు పెట్టేసారు. మరి డబ్బింగ్ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలయ్యాక గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ లాక్ చెయ్యడానికి ఏమైంది, ఆ రిలీజ్ డేట్ ఏదో ఇచ్చేస్తే మెగా ఫ్యాన్స్ కూల్ అవుతారు.
దిల్ రాజు డిసెంబర్ లో గేమ్ ఛేంజర్ అంటే మరొకరు అబ్బే గేమ్ ఛేంజర్ డిసెంబర్ కి వచ్చే పరిస్థితి లేదు అంటూ ట్వీట్లు వెయ్యడంతో మెగా అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రస్తుతం గేమ్ చెంజర్ డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. సో ఇక గేమ్ ఛేంజర్ టీజర్ కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది అంటూ చాలామంది మాట్లాడుతున్నారు.
మరి శంకర్ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ విషయంలో ఎందుకింతగా ఆలోచిస్తున్నారో అనేది మెగా అభిమానులకు అర్ధం కావడం లేదు. రామ్ చరణ్ కూడా గేమ్ ఛేంజర్ మూడ్ నుంచి పూర్తిగా బయటికొచ్చేసి RC 16 కోసం రిపేర్ అవుతున్నారు.