అక్కినేని అఖిల్ కొత్త సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. ఏజెంట్ నిరాశ తర్వాత మళ్ళీ అఖిల్ కొత్త సినిమా మొదలు పెట్టేందుకు చాలా ఆలోచిస్తున్నాడు. అంతేకాదు మీడియా కి కూడా అఖిల్ అంతగా కనిపించడం లేదు. ఈమధ్యన అనంత్ అంబానీ పెళ్ళిలో స్పెషల్ గా కనిపించిన అఖిల్ మళ్ళి బయట కనిపించలేదు.
అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో ధీర అనే మాస్ మూవీ చేస్తున్నాడని అన్నప్పటికీ ఇప్పటివరకు ఆ సినిమా విషయమై తేలలేదు. మరోపక్క వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడు మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో అఖిల్ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ అవుతుంది, ఈ చిత్రాన్ని నాగార్జున-నాగ చైతన్య కలిసి మనం ఎంటెర్టైనెంట్ బ్యానర్ లో నిర్మిస్తారని అంటున్నారు.
తాజాగా అఖిల్ - మురళి కిషోర్ అబ్బురు కాంబోలో మొదలు కాబోయే మూవీ కి లెనిన్ అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. మరి అఖిల్ లెనిన్ గా ఎప్పుడు సెట్స్ లోకి అడుగుపెడతాడో అని అక్కినేని అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు.