తమిళ బిగ్ బాస్ ఆడియన్స్ కి కమల్ హాసన్ హోస్ట్ అంటే ఎంతో ఇష్టం. కమల్ హాసన్ సరదాగా, కోపంగా, గంభీరంగా హౌస్ మేట్స్ తో ప్రవర్తించిన తీరుకు తమిళ బుల్లితెర ఆడియన్స్ ఫిదా అయ్యేవారు. గత ఏడేళ్ళుగా కమల్ హాసన్ తమిళ బిగ్ బాస్ ని హోస్ట్ చేస్తున్నారు. మధ్యలో చిన్న చిన్న బ్రేకులిచ్చిన ఆయన స్థానంలో ఒకటి రెండు ఎపిసోడ్స్ కి హీరో శింబు జాయిన్ అయ్యేవాడు.
అయితే ఇప్పుడు తమిళ బిగ్ బాస్ ఆడియన్స్ కి కమల్ బిగ్ షాక్ ఇచ్చారు. తాను సీజన్ 8 కి హోస్ట్ గా రాలేకపోతున్నందుకు క్షమించమంటూ కమల్ రాసిన లేఖ వైరల్ గా మారింది. గత ఏడేళ్లుగా మీతో అనుబంధాన్ని పెనవేసుకున్నాను. అది మాటల్లో చెప్పలేను, కానీ ఇప్పుడు ఈ సీజన్ కి హోస్ట్ గా రాలేకపోతున్నాను. నేను పూర్తి చెయ్యాల్సిన కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి. అందుకే ఇలా అంటూ కమల్ లేఖలో రాసారు.
మరి కమల్ హాసన్ విక్రమ్ తర్వాత కెరీర్ లో మళ్ళీ తిప్పుకున్నారు. వరస ప్రాజెక్ట్స్ తో దున్నేస్తున్నారు. కల్కి లో నెగెటివ్ కేరెక్టర్ చేసిన కమల్ కి ఆ చిత్రంతో బాగా పేరొచ్చింది. కల్కి 2 లో కమల్ పాత్ర నిడివి ఎక్కువే ఉంటుంది. మరోపక్క మణిశర్మతో థగ్ లైఫ్ చేస్తున్న కమల్ కి ఇంకా రెండు మూడు ప్రాజెక్ట్స్ పూర్తి చెయ్యాల్సి బాధ్యత ఉండడంతో బిగ్ బాస్ నుంచి తప్పుకుంటున్నారని తెలుస్తోంది.