Advertisementt

బాబోయ్.. రోజా ఇలా ఉందేంటి!!

Wed 07th Aug 2024 09:49 AM
roja  బాబోయ్.. రోజా ఇలా ఉందేంటి!!
Roja Italy Vacation Photos బాబోయ్.. రోజా ఇలా ఉందేంటి!!
Advertisement
Ads by CJ

కట్టు బొట్టు చీర పక్కనబెట్టి చుడీదార్ వేసుకొని మగాడిలా తిరగడం ఏంటి..? ఆడవారికి తప్పనిసరి ఏమిటి అనేది తెలియదా..? సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించి ఒక చీర కట్టు మరిచిపోతే ఎలా..? అవును.. నేను మాత్రం ఇంత వరకూ మేకప్ వేసుకొని రాజకీయాల్లోకి వెళ్ళిందే లేదు..! ఇవీ వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు టీడీపీ మహిళా నేతలను, మరీ ముఖ్యంగా వంగలపూడి అనితను ఉద్దేశించి ఫైర్ బ్రాండ్ రోజా సెల్వమణి చేసిన పెద్ద పెద్ద కామెంట్స్. సీన్ కట్ చేస్తే అదేదో అంటారే రూల్స్ పెడతాం అంతే.. కానీ పాటించం అన్నట్టు ప్రవర్తిస్తున్నారనే తిట్లు తింటున్నారు..!

అడ్రస్ దొరికింది..!

వైసీపీ అధికారంలో ఉండగా రోజా ఆడిందే ఆట.. మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడినా అది కరెక్టే..! కాదని ఎవరైనా కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారో అబ్బో ఆ తర్వాత కథే వేరుగా ఉంటుందిలే..! రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ఉన్నన్ని రోజులు ఎక్కడ చూసినా కనిపించే వారు.. వినిపించేవారు. కానీ అధికారం అలా పోయిందో లేదో అడ్రస్ లేకుండా పోయారు.. రోజా వాయిస్ సంగతి అటుంచితే మనిషే కనిపించలేదు. అప్పుడప్పుడు అలా చుట్టపు చూపుగా నగరి నియోజకవర్గంకు వచ్చి వెళ్తూ వస్తున్నారే తప్ప.. మీడియాకు మాత్రం ఎక్కడ కనిపించలేదు.. మాట్లాడటానికి సాహసం చేయలేదు. అప్పుడప్పుడు గుడులు, గోపురాలకు వెళ్తూ అలా మీడియా కంట పడుతున్నా మునుపటి ఫైర్ పోయిందో లేకుంటే మరేం జరిగిందో తెలియదు కానీ కనీసం ఒక్కటంటే ఒక్క మాటా మీడియాతో మాట్లాడటం లేదు. ఈ క్రమంలోనే కొందరు రాజకీయాలకు స్వస్తి చెప్పారని.. మరికొందరు మళ్ళీ సినిమాల్లో అవకాశాలు కోసం రెడీ అవుతున్నారని.. ఇంకొందరు ఇక పూర్తిగా తమిళనాడుకే పరిమితం అవుతారని ఇలా ఒకటా రెండా ఎవరికి తోచినట్లు వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.. మీడియాలో రాసేసుకుంటున్నారు. ఐతే రోజా అడ్రస్ దొరికింది.. ఫోటోలతో సహా బయటికి వచ్చాయి. 

ఇదిగో ఒక లుక్కేయండి!

వైసీపీ హయాంలో జరిగిన అవినీతి.. ముఖ్యంగా మంత్రుల బాగోతాన్ని బయట పెట్టడానికి కూటమి సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే శ్వేత పత్రాలు రిలీజ్ చేసిన సీఎం నారా చంద్రబాబు త్వరలోనే అవినీతి కేసులు నమోదు చేయడానికి సర్వం సిద్ధం అయ్యింది. ఈ క్రమంలోనే రోజా కనిపించకుండా పోయారన్నది టీడీపీ శ్రేణులు చెబుతున్న మాట. ఐతే.. రోజా ఎక్కడికీ పారిపోలేదు విదేశాల్లో గట్టిగానే విహరిస్తున్నారు. యూరప్ పర్యటనకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇటలీలో మాజీ మంత్రి ఉన్నట్టు రోజా ఫోటోలను బట్టి తెలుస్తోంది. రోజా కూతురు విదేశాలలో చదువుకుంటున్నారు. బిడ్డను కలవడానికి విదేశాలకు వెళ్లారని సమాచారం. ఎందుకంటే రోజా పక్కనే కూతురు కూడా ఉన్నారు. ఆమె కూతురి కోసమే వెళ్ళారా.. లేకుంటే మరో పని మీద వెళ్ళారా..? విదేశాలు సరే ఎక్కడున్నారు..? అనేది పక్కన పెడితే రోజా ధరించిన దుస్తులు గురుంచే పెద్ద చర్చ జరుగుతోంది.

ఆట ఆడుకుంటున్నారే..!

మోడరన్ దుస్తుల్లో అది కూడా మోకాళ్లపై వరకు మాత్రమే ఉండటం.. ఒక కాలుకు టాటూ ఉన్నట్లుగా ఫోటోలో ఉంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు, వైసీపీ కార్యక్తలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక రోజా అధికారంలో ఉండగా డెస్సింగ్ గురుంచి పెద్ద పెద్ద సూక్తులు, అంతకు మించి లెక్చర్లు ఇచ్చిన రోజులు.. ఆ మాటలు టీడీపీ శ్రేణులు, నెటిజన్లు గుర్తుకు తెచ్చుకొని, వీడియోలు తెగ వైరల్ చేసేస్తున్నారు. ఇక కామెంట్స్ అంటారా.. బాబోయ్ నోటితో చెప్పలేం.. రాతల్లో రాయలేం అంతే..! ఆడవారి బట్టల గురుంచి మాట్లాడిన రోజా విదేశాల్లో ఎంత సంస్కారం, పద్ధతిగా తిరుగుతున్నారో చూడండి అంటూ సెటైర్లు పిలుస్తున్నారు. ఏదేమైనా ఆమె నేటి యువతకు ఆదర్శప్రాయులు అని గట్టిగానే ఇచ్చి పడేస్తున్నారు. విదేశాలకు వెళ్ళినప్పుడు ఇవన్నీ కామన్ దీనికే ఇంత చర్చ.. రచ్చ ఎందుకు అని కొట్టిపడేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ ఫొటోలు ఎప్పడివో..? రోజా విదేశాల ఎందుకు వెళ్లారో..? తెలియదు కానీ.. జనాలు, నెటిజన్లు మాత్రం ఒక ఆట ఆడుకుంటున్నారు..! మరి ఇవన్నీ నిజమే ఐతే రోజా నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.

Roja Italy Vacation Photos:

Ex Minister Roja Went to Italy Vacation with Family Photo goes Viral

Tags:   ROJA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ