మహేష్ ఫ్యాన్స్ చాలా మౌనంగా కనిపిస్తున్నారు. ఆగష్టు 9 న మహేష్ బర్త్ డే. మహేష్ బర్త్ డే రోజున రోజున ఏదో ట్రీట్ తీసుకోవడం మహేష్ అభిమానులకు అలవాటు. ఆ అప్ డేట్ తో మహేష్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ వారు రచ్చ చేస్తారు. కానీ ఈసారి మహేష్ బర్త్ డే చప్పగా ఉంటుంది అనే ఆలోచనే వారిని నిరాశ పరుస్తుంది.
గుంటూరు కారం విడుదలై ఎనిమిది నెలలవుతుంది. ఇప్పటివరకు మహేష్ బాబు కొత్త సినిమా ఊసు లేదు. రాజమౌళి తో మహేష్ చెయ్యబోయే చిత్రం పై ఆగస్టు 9 న ఎలాంటి అప్ డేట్ రావడం లేదు అంటున్నారు. సెప్టెంబర్ వరకు మహేష్-రాజమౌళి కాంబో మూవీ పై ఎలాంటి ప్రకటన ఉండదు అనే న్యూస్ మహేష్ ఫ్యాన్స్ ని డిజ్ పాయింట్ చేస్తుంది.
మహేష్ బర్త్ డే రోజున రాజమౌళి సినిమా అప్ డేట్ ఇస్తే బావుంటుంది అనేది వారి కోరిక. అది జరగడం లేదు అని తెలిసి మహేష్ ఫ్యాన్స్ మౌనంగా ఉన్నారు. బర్త్ డే రోజున మహేష్ ని ట్రెండ్ చెయ్యాలనే వారి కోరిక తీరేలా కనిపించడం లేదు.