సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు కాదు డిప్యూటీ సీఎం బర్త్ డే. మరి పవన్ కళ్యాణ్ బర్త్ డే కి పవన్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకోసమే పవన్ డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ కి సర్ ప్రైజ్ వీడియో ఒకటి ప్లాన్ చేస్తున్నాడట. అది కూడా OG నుంచి పవన్ కళ్యాణ్ స్పెషల్ బర్త్ ట్రీట్ ని సుజిత్ సిద్ధం చేస్తున్నాడట.
పవన్ కళ్యాణ్ ఏపీ ఎలక్షన్ కారణంగా సినిమా షూటింగ్స్ పక్కనపెట్టారు. అందులో OG, హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుతంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సీఎం చంద్రబాబు పక్కన సమాన హోదాలో పనులు చక్కబెడుతున్నారు.
అక్టోబర్ నుంచి పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ కోసం సిద్దమవనున్నారు అని తెలుస్తుంది. ఈలోపు ఆయన బర్త్ డే కి OG డైరెక్టర్ సుజిత్ OG నుంచి అదిరిపోయే స్పెషల్ వీడియో రెడీ చేస్తున్నారనే మాట పవన్ ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.