Advertisementt

ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ కి ముహూర్తం ఫిక్స్

Tue 06th Aug 2024 10:57 AM
ntr  ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ కి ముహూర్తం ఫిక్స్
NTR-Neel project gets start time ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ కి ముహూర్తం ఫిక్స్
Advertisement
Ads by CJ

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్ కంప్లీట్ చేసేందుకు కష్టపడుతున్నారు. దేవర రొమాంటిక్ సాంగ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఇంప్రెస్ అవుతున్నారు. ఇక దేవర పూర్తి కాగానే ఎన్టీఆర్ వార్ 2 కోసం ముంబై వెళతారని తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఓ పక్క ఆనందం, మరోపక్క దిగులు.

ఆనందం ఎందుకంటే వార్ 2 కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లడం, దిగులుకు కారణం.. ఆగష్టు నుంచి మొదలు కావాల్సిన పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబో మూవీ పై ఎలాంటి అప్ డేట్ లేకపోవడం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కాల్సిన ఈ మాస్ కాంబోపై విపరీతమైన అంచనాలున్నాయి. కానీ ఈ కాంబో ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుందో తెలియక అభిమానులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు.

తాజాగా నీల్-ఎన్టీఆర్ మూవీ ఆగష్టు 9 న పూజా కార్యక్రమాలతో మొదలు కాబోతుంది, అది కూడా హైదరాబాద్ లోనే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది అని తెలుస్తుంది. అది వినగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఆగష్టు లో పూజా కార్యక్రమాలతో సినిమా మొదలైనా సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూట్ కి వెళుతుంది అని సమాచారం. 

NTR-Neel project gets start time:

Muhurat fixed for NTR- Prashanth Neel project

Tags:   NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ