నిన్న సోమవారం సాయంత్రం దేవర పార్ట్ 1 నుంచి వచ్చిన సెకండ్ సింగిల్ చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాస్సేపు.. అస్తమానం నీ లోకమే నా మైమరపు.. చేతనైతే నువ్వే నన్నాపు అనే సాంగ్ వదిలారు. ఆ సాంగ్ లో జాన్వీ కపూర్ అందాలు బాగా ఎక్స్ పోజ్ అయ్యాయి. జాన్వికపూర్ ప్రతి అవుట్ ఫిట్ అద్భుతమే అన్నట్టుగా ఉంది.
జాన్వీ అందాలుకు ఫిదా అవ్వాల్సిందే. అయితే జాన్వీ కపూర్ ని ఎంత అందంగా, గ్లామర్ గా చూపించినా అందరి కళ్ళు ఎన్టీఆర్ పైనే నిలిచాయడంలో సందేహం లేదు. ఎన్టీఆర్ డాన్స్ కానివ్వండి, ఆయన లుక్స్ కానివ్వండి అన్ని ఎన్టీఆర్ పై నుంచి చూపుతిప్పుకోనివ్వలేదు. జాన్వీ కపూర్ అందాలు ఎప్పుడైనా చూడొచ్చు కానీ.. ఎన్టీఆర్ ని మళ్ళీ మళ్ళీ చూడల్సిందే అన్నట్టుగా ఉంది ఆయన హ్యాండ్ సమ్ స్టైలిష్ లుక్.
రొమాంటిక్ గా ఎన్టీఆర్ జాన్వీ కపూర్ తో వేస్తున్న ప్రతి స్టెప్ చూడ ముచ్చటగా ఉండడమే కాదు.. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ఎన్టీఆర్ ని ఇలా చూశామంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు మూవీ లవర్స్ అంతా ఎన్టీఆర్ లుక్స్ కి మెస్మరైజ్ అవుతున్నారు.