Advertisementt

ప్రభాస్-త్రిష మరోసారి ట్రీట్ ఇస్తారా?

Mon 05th Aug 2024 10:14 PM
prabhas  ప్రభాస్-త్రిష మరోసారి ట్రీట్ ఇస్తారా?
Spirit Brings Back Varsham Duo ప్రభాస్-త్రిష మరోసారి ట్రీట్ ఇస్తారా?
Advertisement
Ads by CJ

వర్షం సినిమాలో ప్రభాస్-త్రిష పెయిర్ ప్రేక్షకు లని విపరీతంగా ఆకట్టుకుంది. గోపీచంద్ విలనిజం అలాగే ప్రభాస్-త్రిష మధ్యన కెమిస్ట్రీ అన్ని హైలెట్ అయ్యాయి. ప్రభాస్-త్రిష ఎన్నో ఏళ్ళ క్రితం కలిసి వర్షం మూవీలో నటించారు. ఆ తర్వాత ఈ జోడి మళ్ళీ బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు. కానీ ఇప్పుడు ఈ జోడి మరోసారి తెర పై కనిపించబోతున్నారనే వార్త తెగ వైరల్ అవుతుంది. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి సక్సెస్ తర్వాత రాజా సాబ్ ని ముగించే పనిలో ఉండగా.. సెప్టెంబర్ నుంచి ప్రభాస్ హను రాఘవపూడి మూవీ మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈచిత్రంలో మృణాల్ ఠాకూర్ ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ అనే ప్రచారం జోరుగానే సాగుతుంది. 

ఇక ఆ తర్వాత ప్రభాస్ మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేస్తారు. ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ పోషిస్తారని అంటున్నారు. మరోపక్క ప్రభాస్ పోలీస్ అధికారిగా కనిపిస్తారని సందీప్ రెడ్డి వంగ రివీల్ చేసేసారు. అయితే ఈచిత్రంలో హీరోయిన్ గా త్రిష ని ఎంపిక చేయబోతున్నారట. 

త్రిష కూడా ప్రస్తుతం అంటే పొన్నియన్ సెల్వన్ తర్వాత ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం తమిళనాటే కాదు తెలుగులోను పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తుంది. ఇప్పుడు ప్రభాస్ తో మరోసారి త్రిష అనగానే ప్రభాస్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. 

Spirit Brings Back Varsham Duo:

Prabhas and Trisha to Reunite for Spirit ?

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ