ప్రభాస్ కి పడిపోని హీరోయిన్స్ ఉండరు, ఆయనతో పని చేసే, చేసిన ప్రతి హీరోయిన్స్ ప్రభాస్ వ్యక్తిత్వానికి, ఆయన ఆథిధ్యానికి కూడా ఫిదా అవుతూ గొప్పగా చెబుతూ ఉంటారు. అలా చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. అనుష్క, శ్రద్ద కపూర్, కరీనా కపూర్, దీపికా పదుకొనె, దిశా పటాని ఇలా ప్రతి హీరోయిన్ ప్రభాస్ సెట్స్ లో తమకి పంపించే ఫుడ్ గురించి చెప్పారు.
ఇప్పుడా లిస్ట్ లోకి మరో హీరోయిన్ చేరింది. ఆమె రాజా సాబ్ హీరోయిన్ మాళవిక మోహనన్. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న మాళవిక మోహనన్ ప్రభాస్ తన ఇంటి నుంచి పంపించే భోజనంపై తాజాగా తంగలాన్ ప్రెస్ మీట్ లో చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.
ఈరోజు జరిగిన తంగలాన్ మీడియా మీట్ లో రాజా సాబ్ సెట్స్ లో ప్రభాస్ ఎలా ఉంటారు, ఆయన లో మీకేమి నచ్చింది అని అడిగితే.. ప్రభాస్ పంపించే ఫుడ్ అంటే చాలా ఇష్టం, అది ఎలా ఉంది.. మీకు నచ్చిందా అంటే అవును మా అమ్మ చేసిన వంట లాగే ఉంది అంటూ మాళవిక మోహనన్ నవ్వుతూ చెప్పింది. అది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ మా ప్రభాస్ కి మరో హీరోయిన్ పడిపోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు.