తారక్-జాన్వీ కపూర్ ని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పై చూద్దమా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. వారి కలయికలో ఒక్క పిక్ వస్తే చాలు అన్నట్టుగా చూసారు. గత రెండు రోజులుగా దేవర మేకర్స్ ఎన్టీఆర్-జాన్వీ కపూర్ రొమాంటిక్ పిక్స్ వదులుతూ విపరీతమైన క్రేజ్ క్రియేట్ చేస్తున్నారు. పిక్ పిక్ కి డోస్ పెంచుతూ ఎన్టీఆర్-జాన్వీ కపూర్ ల రొమాంటిక్ ఫోజులపై హైప్ క్రియేట్ చేసారు..
ఇక ఇప్పుడు
చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు
ఊరికే ఉండదు కాస్సేపు
అస్తమానం నీ లోకమే నా మైమరపు
చేతనైతే నువ్వే నన్నాపు
రా నా నిద్దర కులాసా నీ కలలకిచ్చేసా
నీ కోసం వయసు వాకిలి కాశా
రా నా ఆశలు పోగేశా నీ గుండెకు అచ్చేసా
నీ రాకకు రంగం సిద్ధం చేశా
ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీపేరు పెట్టింది వయ్యారం
ఓణీ కట్టింది గోరింట పెట్టింది
సామికి మొక్కులు కట్టింది ... సాంగ్ విజువల్ గా వదిలారు.
హీరోపై తనకున్న ప్రేమను హీరోయిన్ చెప్పటమే ఈ సాంగ్. పాటను రామజోగయ్య శాస్త్రి అద్భుతంగా రాశారు. ఎన్టీఆర్, జాన్వీ జంట పాటలో రొమాంటిక్‌గా కనిపించటం అభిమానులకు కనువిందుగా ఉంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. బీచ్ తీరంలో ఎన్టీఆర్ డాన్స్, జాన్వీ కపూర్ గ్లామర్ అవతార్‌లో కనిపిస్తూ, వినసొంపుగా ఉన్న పాట మనసును హత్తుకుంటోంది. బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీ చూడటానికి సింపుల్‌గా కనిపిస్తూనే కళ్లు తిప్పుకోనీయట్లేదు. జాన్వీ కపూర్ గ్లామర్ , అలాగే ఎన్టీఆర్ ప్రతి డాన్స్ మూమెంట్స్, లుక్స్ అన్ని అభిమానులను తెగ ఇంప్రెస్ చేస్తున్నాయి. అనిరుద్ మ్యూజిక్ లో ఎన్టీఆర్-జాన్వీ ల పాట వైరల్ అయ్యింది.