అనసూయ ఫ్యాషన్ పోకడలు ఉన్న అమ్మాయి. ఆ విషయం తరచూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాము. పెళ్లయ్యింది, ఇద్దరు పిల్లలున్నారు. అయినప్పటికీ అనసూయ గ్లామర్ అవుట్ ఫిట్స్ తో అదరగొట్టేస్తుంది. ఫ్యాషన్ ప్రపంచంలోకి వచ్చాక పెళ్లయిందా, లేక ఏదైనా చూడరు. టాలెంట్ ఉందా, ఎంత క్రేజ్ ఉంది అనేది మాత్రమే చూస్తారు. మనం ఎదుగుతున్నామంటే మనని ఎంతమంది ప్రోత్సహించేవారు ఉంటారో.. అంతేముంది విమర్శించేవాళ్లు ఉంటారు.
అనసూయ అప్పుడప్పుడు కాంట్రావర్సీ కామెంట్స్ చేస్తుంది. ఆ సమయంలో ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ పై కూడా నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. ఆంటీవి నువ్వు చిన్న బట్టలేసుకోవడమేమిటి అని ట్రోల్ చేస్తూ ఉంటారు. తాజాగా అనసూయ తన డ్రెస్సింగ్ స్టయిల్ అంటే తన కొడుకుకి కూడా నచ్చదని చెబుతుంది.
తాను గనక నడుంపైకి టాప్ వేసుకుంటే అది తన కొడుక్కి నచ్చదని.. ఫుల్ టాప్ వేసుకోవచ్చు కదా అంటాడు. అంతేకాదు వేరే డ్రెస్సుల విషయంలోనూ ఇలా చాలాసార్లు కామెంట్స్ చేస్తూ ఉంటాడని అనసూయ చెప్పింది. కానీ నాకు ఏవి కంఫర్ట్బుల్ గా ఉంటాయి, ఏ డ్రెస్సులు నా అందాన్ని హైలెట్ చేస్తాయో వాటిని వేసుకోవడానికి నేను ఇష్టపడతాను.
అలాంటి విషయాల్లో కామెంట్స్ చెయ్యకూడదు అని తన కొడుక్కి తాను చెబుతానని, వాళ్ళకి డ్రెస్సులు కొనడానికి షాప్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇష్ట ప్రకారమే డ్రెస్ లు సెలెక్ట్ చేసుకోమంటాను, వాళ్ళ ఇష్టాల్లో నేను వేలు పెట్టను అంటూ అనసూయ కొడుకు గురించి చెప్పి షాకిచ్చింది.