Advertisementt

మహేష్ కి విలన్ గా విక్రమ్: క్లారిటీ ఇదే

Mon 05th Aug 2024 01:18 PM
vikram  మహేష్ కి విలన్ గా విక్రమ్: క్లారిటీ ఇదే
Vikram as Mahesh villain: This is the clarity మహేష్ కి విలన్ గా విక్రమ్: క్లారిటీ ఇదే
Advertisement
Ads by CJ

రాజమౌళి-మహేష్ కాంబోలో మొదలు కాబోయే పాన్ ఇండియా ఫిలిం పై అంచనాలు ఆకాశంలోకి వెళ్లిపోతున్నాయి. ఆగష్టు 9 న మహేష్ బర్త్ డే. ఆ రోజు ఈ కాంబో పై అప్ డేట్ ఉంటుందేమో అనే ఆశతో మహేష్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ ఆ సర్ ప్రైజ్ సెప్టెంబర్ వరకు రాకపోవచ్చు అని తెలుస్తోంది. 

మరోపక్క రాజమౌళి మహేష్ కోసం ఓ స్టార్ హీరోని విలన్ గా ఎంపిక చేస్తున్నారని.. అది తమిళ హీరో విలక్షణ నటుడు విక్రమ్ అయితే ఎలా ఉంటుంది అని ఆలోచించడమే కాదు.. ఇప్పటికే రాజమౌళి హీరో విక్రమ్ తో సంప్రదింపులు జరుపుతున్నారనే మాట వినిపిస్తుంది. మరి విక్రమ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారు. 

ఆయన తన సినిమా తంగలాన్‌ ప్రమోషన్స్ కోసం ఇక్కడికి వచ్చారు. గత రాత్రి తంగలాన్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగగా.. ఈరోజు సోమవారం ఉదయం మీడియా మీట్ నిర్వహించారు. అందులో విక్రమ్ కి రాజమౌళి-మహేష్ మూవీ పై ప్రశ్న ఎదురు కాగా.. విక్రమ్ నవ్వుతూ.. నాకు రాజమౌళి తో కలిసి వర్క్ చెయ్యాలనే కోరిక చాలా ఉంది. 

చాలాసార్లు ఈ విష‌య‌మై మాట్లాడుకొన్నాం కూడా. త‌ప్ప‌కుండా రాజమౌళి నేను ఓ సినిమా చేస్తాం. అయితే.. అది ఎప్పుడో చెప్ప‌లేను అంటూ మహేష్ సినిమాపై అసలు విషయం చెప్పకుండా విక్రమ్ దాటేసారు. 

Vikram as Mahesh villain: This is the clarity:

Chiyaan Vikram About Acting In SSMB29 Movie

Tags:   VIKRAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ