రామ్ చరణ్-శంకర్ ల గేమ్ ఛేంజర్ డిసెంబర్ నుంచి మార్చ్ కి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ విషయంలో విసిగిపోయి ఉన్నారు.
నిర్మాత దిల్ రాజు వాళ్ళని కూల్ చేసే పనిలో డిసెంబర్ చివరి వారమైన క్రిస్ట్మస్ కి గేమ్ ఛేంజర్ విడుదల అంటూ ఓ సినిమా ఈవెంట్ లో చెప్పడంతో మెగా ఫ్యాన్స్ చల్లబడ్డారు. ఇండియన్ 2 పనైపోయింది.. ఇక శంకర్ గేమ్ ఛేంజర్ పై కూర్చుంటారు. రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ ఫినిష్ అయ్యింది.. ఇక ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చివరి వరకు ఆయనకు పోస్ట్ ప్రొడక్షన్ అలాగే ప్రమోషన్స్ కి తగినంత సమయం ఉంది.
సో డిసెంబర్ లోనే గేమ్ ఛేంజర్ రావడం పక్కా అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ రిలీజ్ విషయంలో మాకేమి సమాచారం లేదు అని సినిమా ఇండస్ట్రీలోనే కాదు, డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్ లో కూడా మాట్లాడుకుంటున్నారంటూ కొంతమంది వేస్తున్న ట్వీట్లు చూసి మెగా అభిమానుల్లో మరోసారి అసహనం మొదలు కాగా.. గేమ్ ఛేంజర్ కూడా పుష్ప మాదిరి మార్చ్ కి వెళ్లే అవకాశం లేకపోలేదు అనే టాక్ బలంగానే వినిపిస్తుంది.