జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్‌పై ఓ వర్గానికి చెందిన మీడియా, వెబ్‌సైట్లు చెత్త రాతలు రాయడం మొదలు పెట్టేశాయి..! ఎంతలా అంటే.. అసలు ఏపీకి డిప్యూటీ సీఎం ఉన్నారా..? ఉంటే ఏపీలోనే ఉన్నారా..? మరి కనిపించలేదు.. వినిపించలేదేం..? పోనీ సినిమాలు చేస్తున్నారా అంటే అదీ లేదే..? పవన్ ఉనికి కోల్పోతున్నారేం..? ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని వార్తలతో బురద చల్లడం షురూ చేసేశారు. పోనీ ఇదంతా చేస్తున్నది ఏ బులుగు మీడియానో అంటే అదో రకం.. కూటమిలో ఉన్న టీడీపీ అనుకూల వెబ్‌సైట్లే ఇలా చేస్తుండటం గమనార్హం.
బాబోయ్ ఏంటిది..?
జనసేన పార్టీ పెట్టినప్పట్నుంచీ అధినేత పవన్ కల్యాణ్ స్టయిలే వేరు. అధికారంలో ఎవరున్నా సరే చుక్కలు చూపిస్తూ వచ్చేవారు. 2024 ఎన్నికల్లో కూటమి కట్టడం మొదలుకుని గెలుపు వరకూ కీలక పాత్రే పోషించారు. ఆఖరికి అద:పాతాళానికి తొక్కుతానని చెప్పి అన్నంత పనే చేసేశారు. ఇంత చేసిన పవన్‌కు చంద్రబాబు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చారు కానీ.. ఆయన అనుకూల మీడియా ద్వారా ఓ వైపు నుంచి టార్గెట్ చేశారనే విమర్శలు జనసేన నుంచి వస్తున్నాయి. పవన్ ఏమయ్యారు..? ఎక్కడున్నారు..? మీడియా ముందుకు రావట్లేదేం..? ప్రెస్‌మీట్ పెట్టలేనంత బిజీగా ఏం చేస్తున్నట్లు..? పోనీ ఇవన్నీ కాదని సినిమాలు ఏమైనా చేస్తున్నారా..? అదీ లేదు కదా..? జనాలకు, మీడియాకు ఎందుకు కనపడట్లేదు..? కనీసం ఎక్కడా పర్యటించలేదేం..? అని ఓ పేరుగాంచిన వెబ్‌సైట్‌లో వార్త రావడంతో జనసైనికులు, మెగాభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
అవునా.. ఇటు రా..!
గ్రామీణ, పంచాయితీరాజ్ శాఖ తీసుకున్నప్పట్నుంచీ అధికారులు, శాఖలను పరుగులుపెట్టిస్తున్నారు పవన్. ఎందుకంటే.. వరుస రివ్యూ మీటింగ్‌లు, ఎర్రచందనం అక్రమ రవాణా, గ్రామీణ ఆరోగ్యం, నిధులు ఇలా అన్ని విషయాలపై అధికారులను ఓ ఆటాడుకుంటున్నారు. అలాంటిది.. ఉనికి కోల్పోతున్న పవన్ అని మరో వెబ్‌సైట్‌లో రావడం ఎంత విచిత్రంగా ఉందో..! అయినా గ్రామాల్లో తిరిగితేనే ఉనికి ఉన్నట్లు.. లైమ్ లైన్‌లో ఉన్నట్లు అనుకుంటే ఎలా..? అదీ కాకుండా ప్రెస్‌మీట్ పెట్టకపోతే పవన్ అనే వ్యక్తి లేనట్టేనా..? ప్రతిరోజూ మీడియా ముందుకు అటెండెన్స్ వేయించుకోవాలా..? పోనీ ఈ చెత్త రాతలు రాసిన మీడియా ఆఫీసుకు వచ్చి ఎస్ సార్ అని చెప్పి రావాలా.. ఏంటి..?.. ఇక సోషల్ మీడియాలో అంటారా..? ప్రతిదానికీ ఈ మీడియంను వాడటం ఎంతవరకూ సబబు..? ఇక సినిమాలు అంటారా.. ఆయన అదే ఫీల్డ్ నుంచి వచ్చారు.. పైగా ఇప్పటికే చాలా సినిమాలకు సైన్ చేశారు గనుక ఇప్పుడు కాకపోయినా రేపు చేస్తారు..? అందులో తప్పేంటి..? సినిమా వ్యక్తి సినిమాలు చేయక ఇంకేం చేస్తారు..? అనే మినిమం సెన్స్ కూడా లేకుండా వార్తలు రాసేస్తే ఎలాగబ్బా..? కాసింత తెలుసుకుని రాయాలిగా..!. అయితే ఈ మధ్య ప్రజావాణిలాగా పవన్ నిర్వహించడం, అధికారులతో వరుస రివ్యూలు, సోషల్ మీడియా వేదికగా పవన్ చేస్తున్న సరికొత్త కార్యక్రమాలతో అందరి నోటా పేరు మార్మోగుతోంది.. అందుకే ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని జనసైనికులు చెబుతున్న మాట. ఏదైతేనేం.. ఇలా వార్తలు రాసే మీడియాకు సేనాని కాస్త గడ్డిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తోంది మరి.