నగరి మాజీ వైస్సార్సీపీ ఎమ్యెల్యే రోజా ప్రస్తుతం నగరి లో కన్నా ఎక్కువగా చెన్నైలో కనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే వస్తుంది. జగన్ అన్నే సీఎం అని ఎంతో నమ్మకం పెట్టుకున్న రోజా కి జగన్ అన్న సీఎం అవడం అటుంచి తన ఎమ్యెల్యే స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో కాస్త షాకయిన రోజా రోజూ నవ్వుతూ ప్రారంభించాలంటూ సోషల్ మీడియాలో హడావిడి చేసింది.
ఇక ఓడిపోయాక ఒక్కసారి మాత్రమే జగన్ ని కలిసిన రోజా ఆ తర్వాత రాజకీయాల విషయంలో చాలా లైట్ గా ఉంటుంది. మీడియాకి కనిపించడమే లేదు. అయితే రోజా ఇప్పుడు ఐదేళ్ల పాటు ఖాళీగా ఉండాలి కాబట్టి ఈలోపు బుల్లితెరపై బిజీ అవ్వాలనుకుంటుందట. అందుకోసమే బుల్లితెర షోస్ కోసం రోజా ప్రయత్నాలు మొదలు పెట్టింది అనే టాక్ వినిస్తుంది.
తనకి బుల్లితెర మీద మంచి ఫేమ్ తెచ్చి పెట్టిన జబర్దస్త్ లో మళ్ళీ జడ్జి అవకాశం కోసం మల్లెమాల ను సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తెలుగులో కన్నా రోజా ఇప్పుడు తమినాట పాగా వెయ్యాలని చూస్తుందట. అందుకే తమిళ టీవీ చానళ్లతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం జబర్దస్త్ కి కూడా స్టార్ కమేడియన్స్ లేక టిఆర్పి పడిపోవడంతో మళ్ళీ రోజా ని పెట్టుకుని అధిక పారితోషికాలు ఇవ్వలేమని మల్లెమాల ఆలోచిస్తుంటే.. తమిళనాడులో మాత్రం టీవీ చానళ్ల నుంచి ఆమెకు ఒకటి, రెండు అవకాశాలు వచ్చే చాన్స్ లు ఉన్నాయని చెబుతున్నారు. రోజా కోసం ఆమె భర్త సెల్వమణి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు.