బిగ్ బాస్ ఫేమ్, బుల్లితెర నటి, జబర్దస్త్ మాజీ యాంకర్ సిరి హన్మంత్ గురించి తెలియని వారుండరు. బిగ్ బాస్ సీజన్ 5 లో షణ్ముఖ్ తో స్నేహం ఆమె ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది. బయటికొచ్చాక ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ గుడ్ బై చేప్పేస్తాడనే ప్రచారం జరిగినప్పటికీ.. సిరి బిగ్ బాస్ తర్వాత షణ్ముఖ్ తో స్నేహాన్ని పక్కనపెట్టి శ్రీహన్ తో కలిసే జర్నీ చేస్తుంది. స్టార్ మా ఈవెంట్స్ లోనే కాకుండా ఈటివి జబర్దస్త్ కి యాంకర్ గా పని చేసింది.
అయితే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లను తీసేసి.. ఓన్లీ జబర్దస్త్ అంటూ శుక్ర, శనివారాల్లో ఈటివి ప్రసారం చెయ్యడమే కాకుండా రెండు షోస్ కి యాంకర్ గా రష్మీ నే ఉంచేయడంతో సిరి జబర్దస్త్ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఢీ డాన్స్ షోలో కనబడుతున్న ఈ అమ్మాయి సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ హడావిడి చేస్తుంది.
తాజాగా చిట్టిపొట్టి నిక్కర్లో ట్రెండీ ఫొటోస్ ని షేర్ చేసింది. గ్లామర్ కి గ్లామర్ ట్రెండ్ కి ట్రెండ్ అన్నట్టుగా సిరి లేటెస్ట్ ఫొటోస్ ఉన్నాయి. బుల్లితెర క్వీన్ సిరి, నీ గ్లామర్ ట్రీట్ సూపర్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నాయి.