రామోజీ ఫిలిం సిటీలో స్పెషల్ గా వేసిన పుష్ప 2 సెట్ లోకి అల్లు అర్జున్ అడుగుపెట్టాడు. ఈమధ్యన ఫ్యామిలీతో విదేశీ ట్రిప్ వేసిన అల్లు అర్జున్ తాజాగా పుష్ప ద రూల్ సెట్ లోకి రావడంతో అభిమానులు ఉత్సాహపడుతున్నారు. సుకుమార్ గత వారం రోజులుగా అల్లు అర్జున్ కి సంబంధం లేని సన్నివేశాల చిత్రీకరణలో బిజీగా వున్నారు.
ఇక అల్లు అర్జున్ - ఫహద్ ఫాసిల్ లపై సుకుమార్ క్లైమాక్స్ చిత్రీకరణ చేపట్టనున్నారు. అయితే అల్లు అర్జున్ తన పార్ట్ షూట్ ని సెప్టెంబర్ 20 కల్లా ఫినిష్ చేసి ఫ్రీ అవుతాడని తెలుస్తోంది. మరి సెప్టెంబర్ 20 కల్లా పుష్ప 2 షూటింగ్ అయ్యిపోతే సుకుమార్ కి రెండు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ కి అలాగే ప్రమోషన్స్ కి సమయం ఉంటుంది. అలా పుష్ప 2 ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 6 కి రావడం పక్కా.. కానీ ఆ విషయం మేకర్స్ చెప్పడం లేదు, అల్లు ఫ్యాన్స్ కి ఆ విషయంలో కన్ఫ్యూజన్ నడుస్తుంది.
కొంతమంది డిసెంబర్ నుంచి మార్చి కి పోస్ట్ పోన్ అవ్వబోతుంది పుష్ప అంటూ చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మరి మార్చ్ లో కొన్ని సినిమాలు రిలీజ్ డేట్ లాక్ చేసేస్తున్నాయి. మేకర్స్ ఏ విషయము ఇప్పటికైనా చెబుతారో, లేదో చూడాలి.