కొద్దిరోజులుగా బిగ్ బాస్ యాజమాన్యం బిగ్ బాస్ 8 ప్రోమోస్ వదులుతూ బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. నాగార్జున ఈసారి వినూత్నంగా హోస్ట్ చెయ్యబోతున్నట్లుగా ప్రోమోస్ తో హింట్ ఇస్తున్నారు. గత కొన్ని సీజన్స్ కి బుల్లితెర ప్రేక్షకులు కోరుకున్న ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో యాజమాన్యం విఫలమవుతుంది.
అందుకే ఈసారి సీజన్ పై క్రేజ్ పెంచేందుకు కొత్త కొత్త ప్లాన్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈసారి 200 మందిని బిగ్ బాస్ కోసం కంటెస్టెంట్స్ గా పేర్లని పరిశీలించి అందులో 25 మందిని ఫైనల్ లిస్ట్ లో చేర్చారట. మరి ఆ లెక్కన క్రేజీ కంటెస్టెంట్స్ ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టించి వారితో రచ్చ లేపనున్నట్లుగా తెలుస్తుంది.
ముందుగా 18 మందిని హౌస్లోకి ఓపెనింగ్ ఎపిసోడ్ లో పంపి ఆ తర్వాత మిగతా వారిని హౌస్ లోకి పంపిస్తారట. ఇక ఈ నెలలో కాకుండా ఎప్పటిలాగే సెప్టెంబర్ మొదటి వారంలోనే బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఓపెనింగ్ తో షో మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. గత సీజన్ లతో పోల్చితే ఈ సీజన్ చాలా కొత్తగా ఉంటుందనే సంకేతాలు యాజమాన్యం బయటికి వదులుతుంది. చూద్దాం ఈ సీజన్ పై ఎంత క్రేజ్ వస్తుందో అనేది.