Advertisementt

అల్లు హీరోకి కూడా ఇలాంటి పరిస్థితా?

Sat 03rd Aug 2024 11:07 PM
allu sirish  అల్లు హీరోకి కూడా ఇలాంటి పరిస్థితా?
Allu Hero also has a similar situation? అల్లు హీరోకి కూడా ఇలాంటి పరిస్థితా?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం థియేటర్స్ లో చిన్న సినిమాల వైపు చూసేందుకు ప్రేక్షకులు అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. పెద్ద సినిమాలకు అయితే పెరిగిన టికెట్ రేట్లు పెట్టుకుని వెళ్లే ఆడియన్స్ చిన్న సినిమాల విషయంలో చాలా లైట్ గా ఉంటున్నారు. అయితే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా విడుదలయ్యాక మంచి టాక్ వస్తే అవి థియేటర్స్ లో నిలబడుతున్నాయి. 

సినిమా ప్రముఖుల వారసులైనా లేదంటే కాస్త పేరున్న హీరో అయినా కొన్నిసార్లు సక్సెస్ లేకపోతె వారి నెక్స్ట్ సినిమాలకు ఓపెనింగ్స్ కూడా ఉండడం లేదు. టాలీవుడ్ లో బడా నిర్మాత అల్లు అరవింద్, నేషనల్ స్టార్ అల్లు అర్జున్.. మరి ఆ ఇంటి వచ్చిన అల్లు శిరీష్ ని ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశారు. 

ఊర్వసివో రాక్షసీవో తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని బడ్డీ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన అల్లు శిరీష్ ని ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. గత వారం రోజులుగా బడ్డీ ప్రియర్స్, ప్రమోషన్స్ తో హడావిడి చేసినా బడ్డీ రిలీజ్ రోజున పట్టుమని పది మంది ప్రేక్షకులు రాక షోస్ క్యాన్సిల్ చేసిన ఘటనలు కోకొల్లలు. 

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. అల్లు శిరీష్ బడ్డీ కి కనీస ఓపెనింగ్స్ రాలేదు. నిజంగా సినిమా ఇండస్ట్రీ లో అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు శిరీష్ సినిమాకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. మిగతా చిన్న, మీడియం హీరోల పరిస్థితి ఏమిటో అంటూ అందరూ తెగ ఆశ్చర్యపోతున్నారు. 

Allu Hero also has a similar situation?:

Allu Sirish starrer Buddy Box office collection

Tags:   ALLU SIRISH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ