అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే..! జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తిట్టొద్దు.. అస్సలు ఆయన జోలికే వెళ్లొద్దు..! మళ్లీ మళ్లీ చెబుతున్నా దయచేసి డిప్యూటీ సీఎంను విమర్శించొద్దు.. బూతులు వద్దంటే వద్దు..! ఇవీ వైసీపీ నేతలు, క్యాడర్‌కు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లియర్ కట్‌గా ఇచ్చిన స్ట్రిక్ట్ వార్నింగ్ అట. అయితే.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌పై ఎన్ని విమర్శలు అయినా చేసుకోండి.. తిట్టేసేయండి కానీ సేనాని జోలికి వెళ్లొద్దంటే వెళ్లొద్దు..! చూశారా.. చూశారా మాస్టారూ.. జగన్‌లో ఎంత మార్పో.. ఇది అస్సలు ఊహించి ఉంటారా..? అస్సలు కానే కాదు కదా..!
ఇదీ అసలు సంగతి!
పవన్ కల్యాణ్ తిట్టాల్సిందే.. అది కూడా మామూలుగా కాదు బూతులు..! ఆయన్ను తిట్టకపోతే టికెట్ అస్సలు ఉండదంటే ఉండదు.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు బహిరంగంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది చెప్పిన మాటలివే. ఈ సాహసం చేయలేక.. అదే జనసేనలో చేరి ఎంపీలుగా గెలిచిన వారు కూడా ఉన్నారంటే అర్థం చేసుకోండి. అలాంటిది ఒక్కసారిగా అధినేత జగన్‌లో ఊహించని మార్పు వచ్చేసింది. సడన్ ఏం జ్ఞానోదయం అయ్యిందో తెలియట్లేదు కానీ.. ఆయనలో ఈ మార్పును చూసిన సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్న పరిస్థితి. అది కూడా.. ప్లీజ్ ప్లీజ్ అని మరీ బతిమలాడి మరీ చెప్పారట జగన్. ఇంటర్వ్యూలు, మీడియా, సోషల్ మీడియా.. ఎక్కడా పొల్తెత్తి మాట కూడా పవన్‌ను అనడానికి వీల్లేదని క్యాడర్, నేతలకు క్లియర్ కట్‌గా ఆదేశాలు ఇచ్చేశారట.
ఎందుకు.. ఏమైంది..!?
ఒకవేళ తప్పక విమర్శించాల్సి వస్తే.. ఆయన్ను మంత్రి పరంగా, శాఖల విషయంలో మాత్రమే కానీ.. వ్యక్తిగత జీవితం గురించి మాత్రం అస్సలు మాట్లొద్దని జగన్ ఆదేశించారట. వాస్తవానికి.. సేనానిని మూడు పెళ్లిళ్లు, కార్లు మార్చినట్లు మారుస్తాడని, దత్తపుత్రుడిని, ప్యాకేజీ స్టార్ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్ని పేర్లతో జగన్ పిలిచేవారో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే టార్గెట్ పవన్.. ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఎంతగా డ్యామేజ్ చేయాలని చూశారో.. దేవుడికే ఎరుక. అలాంటిది వైసీపీని అధ:పాతాళానికి తొక్కిపడేస్తానన్న జనసేన అధినేత అనుకున్నట్లుగానే తన సత్తా ఏంటో చేసి చూపించారు.. బహుశా పవన్ రేంజ్ ఏంటో తెలిసొచ్చిందేమో కానీ జగన్ ఈ ఊహించని నిర్ణయం తీసుకున్నారు మరి. తెరవెనుక ఏం జరుగుతోందో ఏంటో వైసీపీ నేతలు, అధినేతకే తెలియాలి మరి.