అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ ఫినిష్ చేసేసి ఇమ్మిడియట్ గా తదుపరి సినిమాని మొదలు పెట్టేద్దామంటే దర్శకుడు సుకుమార్ మాత్రం పుష్ప 2 షూటింగ్ విషయంలో పర్ఫెక్షన్ అంటూ స్లోగా చేయడంతో సినిమా విడుదల తేదీ విషయంలో లేట్ అవుతూ వస్తుంది. అందుకే అల్లు అర్జున్ కూడా ప్రస్టేట్ అవుతున్నాడనే టాక్ ఉంది.
సుకుమార్ తో చేస్తున్న పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ తదుపరి ఏ దర్శకుడితో సినిమా చేస్తాడో అనే విషయంలో చాలా వరకు అల్లు అభిమానుల్లో క్లారిటీ ఉంది. సందీప్ వంగతో ఒక సినిమా, త్రివిక్రమ్ తో ఒక సినిమాకి కమిట్ అయిన అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో కూడా సినిమా ఉండే అవకాశం లేకపోలేదు.
కానీ వీరిలో ముందుగా ఎవరితో సినిమా మొదలు పెడతాడు అంటే త్రివిక్రమ్ తో మోస్ట్లీ అల్లు అర్జున్ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అంటూ గీత ఆర్ట్స్ నిర్మాత బన్నీ వాస్ చెప్పడం అల్లు ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేసింది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న త్రివిక్రమ్ బన్నీ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. అలా వైకుంఠపురములో తర్వాత ఈ కాంబో పై క్రేజీగా అంచనాలు పెరుగుతున్నాయి. అందుకే అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా పై ఫ్యాన్స్ లో అంత ఆత్రుత.