రాజ్ తరుణ్ వరస గా సినిమాలు చేస్తున్నా అతనికి అదృష్టము కలిసి రావడం లేదు. కెరీర్ ఆరంభంలో చక్కటి సినిమాలు చేసిన రాజ్ తరుణ్ ఆ తర్వాత మూస కథలతో సినిమాలు చేస్తూ వరసగా నిరాశపరిచే సినిమాల్తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నాడు. ఇప్పుడు చూస్తే అతని మాజీ లవర్ విషయంలో బ్యాడ్ అయ్యి కూర్చున్నాడు.
లావణ్య ని మోసం చేసాడనే విషయంలో ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేని రాజ్ తరుణ్ ఒక్కసారిగా తిరగబడరా సామి ప్రమోషన్స్ కోసం మీడియా ముందు ప్రత్యక్షమై లావణ్య విషయమై కూడా ఓపెన్ అయ్యాడు. ఆ తర్వాత అరెస్ట్ భయంతో ముందస్తు బెయిల్ కోసం హై కోర్టు మెట్లెక్కాడు. ఆ విషయం ఎలా ఉన్నా రాజ్ తరుణ్ కెరీర్ లో మరోసారి ఫెయిల్ అయ్యాడు.
గత వారం పురుషోత్తముడితో ఎలాంటి హడావిడి లేకుండా థియేటర్స్ లోకి వచ్చిన రాజ్ తరుణ్ ఆ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఇక ఈ వారం విడుదలైన తిరగబడరా సామి కూడా రాజ్ తరుణ్ ని తీవ్రంగా నిరాశ పరిచింది. తిరగబడరా సామి థియేటర్స్ లో కనీసం ప్రేక్షకులు లేకపోవడంతో చాలా చోట్ల షోస్ క్యాన్సిల్ చెయ్యడం చూస్తే సినిమా పరిస్థితి ఎలా ఉందొ అర్ధమవుతుంది.
మరి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకున్న రాజ్ తరుణ్ కి ఎప్పటిలాంటి రిజల్టే రావడంతో ఢీలా పడిపోయాడు ఈ హీరో.