పెళ్లయ్యి పిల్లలు పుట్టాకే ఆమె సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి యాంకర్ గా గ్లామర్ షో మత్రమే కాదు వాక్ చాతుర్యంతో అనసూయ భరద్వాజ్ ఇప్పుడు పాన్ ఇండియా యాక్టర్ గా పాపులర్ అయ్యింది. ముందుగా సినిమా ఈవెంట్స్ కన్నా జబర్దస్త్ కామెడీ షో కి యాంకర్ గా అనసూయ బుల్లితెరని ఓ ఊపు ఊపేసింది. రకరకాల గ్లామర్ అవుట్ ఫిట్స్ తో యూత్ ని ఆకట్టుకుంది.
ఇప్పుడు అదే అనసూయని ఫాలో అవుతూ మరో భామ పెళ్ళయ్యాక పాపులర్ అవ్వాలని డిసైడ్ అయ్యింది. బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యి ఫేమస్ అవ్వాలనుకున్న స్రవంతి చొక్కారపు అక్కడి నుంచి చాలా త్వరగా ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటికొచ్చాక కొన్నాళ్ళు సైలెంట్ గానే వుంది. ఆ తర్వాత స్రవంతి గ్లామర్ ఫోటో షూట్స్ ని చేస్తూ బిజీగా కనిపించింది.
మెల్లగా సినిమా ఈవెంట్స్ కి యాంకర్ గా మారిన స్రవంతి కి పెళ్లయిపోయింది. పేరెంట్స్ తమ పెళ్లిని ఒప్పుకోలేదని చెప్పిన స్రవంతి కెరీర్ లో బిజీగా మారాలంటే గ్లామర్ చూపించడం తప్ప వేరే దారి లేదనుకుందో ఏమో.. ప్రతి అవుట్ ఫిట్ లోను అందాలు చూపించే పని పెట్టుకుంది. సినిమా ఈవెంట్స్ లో హీరోయిన్స్ కూడా పద్దతిగానే కనిపిస్తున్నారు కానీ స్రవంతి మాత్రం స్కిన్ షో విషయంలో వెనక్కి తగ్గడం లేదు.
వరస ఈవెంట్స్ తో బిజి అయినప్పటికీ.. తన ఫొటోస్ ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో షేర్ చేస్తుంది. అవి చూసే ఈ అమ్మడు మరో అనసూయ అవ్వబోతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్.