పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తో మూవీ ఎప్పుడు మొదలు పెడతారా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తుంటే.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం మా సలార్ 2 షూటింగ్ పూర్తయ్యేవరకు ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీ మొదలు కాదు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో గత డిసెంబర్ లో విడుదలైన సలార్ బ్లాక్ బస్టర్ అవడంతో సలార్ పై అంచనాలు పెరిగిపోయాయి. సలార్ 2 దాదాపుగా 80 శాతం పూర్తయిపోయింది.
మిగతా షూటింగ్ మే నుంచి మొదలవుతుంది అన్నారు. కానీ ఆగస్టు వచ్చింది. మధ్యలో ఎన్టీఆర్ నిర్మాతలు ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీ ని ఆగస్టు నుంచి మొదలు పెడతామని చెప్పారు. ప్రశాంత్ నీల్ కూడా సలార్ 2 ఊసెత్తకుండా ఎన్టీఆర్ మూవీ స్క్రిప్ట్ లాక్ చేసి షూటింగ్ కి రెడీ అవుతున్నారనే మాట వినిపిస్తుంది.
అంతేకాదు గత రెండు రోజులుగా నీల్-ఎన్టీఆర్ మూవీ సెప్టెంబర్ లో మొదలు కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతున్నా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ తో సలార్ షూటింగ్ పూర్తయ్యేవరకు ఎన్టీఆర్ తో మూవీ ఉండే ఛాన్స్ లేదు అంటూ మాట్లాడుతున్నారు. మరి సలార్ తర్వాత సైలెంట్ గా ఉన్న ప్రశాంత్ నీల్ ముందు ప్రభాస్ తోనా.. లేదంటే ఎన్టీఆర్ తో సెట్స్ మీదకి వెళతారో అనే క్యూరియాసిటీ మాత్రం మూవీ లవర్స్ లో మొదలయ్యింది.