సోషల్ మీడియాలోనే కాదు ఈ మధ్యన శ్రీలీల పేరు పలు భాషల్లో తెగ మోగిపోతుంది. టాలీవుడ్ లో నితిన్ తో, రవితేజ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న శ్రీలీల పేరు కోలీవుడ్ హీరోల సరసన బాగా వినిపిస్తుంది. అంతేకాదు అమ్మడు పేరు ఇప్పుడు బాలీవుడ్ లోను హైలెట్ అవుతుంది. అక్కడ వరుణ్ ధావన్ హీరోగా అతని తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వంలో ప్లాన్ చేసుకున్న లవ్ ఎంటర్ టైనర్ లో శ్రీలీల ని హీరోయిన్ గా అనుకున్నారు.
అంతేకాకుండా సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ నటించబోయే డైలర్ లో హీరోయిన్ గా శ్రీలీలనే అంటున్నారు. అయితే శ్రీలీల తనకి డేట్స్ సర్దుబాట చెయ్యడం కుదరడం లేదు అంటూ వరుణ్ ధావన్ మూవీని వదులుకుంది అనే టాక్ బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో మొదలయ్యింది. బాలీవుడ్ ఆఫర్ ని తిరస్కరించిన శ్రీలీల అంటూ హెడ్డింగ్స్ తో సోషల్ మీడియాలో శ్రీలీల పేరు మోగిపోతుంది.
అదలా ఉన్న సమయంలోనే శ్రీలీల సూపర్ స్టైలిష్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. వైట్ మోడ్రెన్ టాప్ లో టైట్ ప్యాంట్ లో కత్తి లాంటి చూపులతో శ్రీలీల అదరగొట్టేసింది. శ్రీలీల న్యూ లుక్ చూడగానే ఆమె అభిమానులు తెగ సర్ ప్రైజ్ అవుతున్నారు.