కల్కి 2898 AD బ్లాక్ బస్టర్ తర్వాత భారీ అంచనాల నడుమ విడుదలైన ఇండియన్ 2 ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇండియన్ 2కి మినిమమ్ వసూళ్లు కూడా రాకవపోవడంతో నిర్మాతలు భారీగా లాస్ అయ్యారు. అప్పటినుంచి చిన్న సినిమాలు వారం వారం బాక్సాఫీసు దగ్గర జాతరను తలపిస్తున్నాయి. వారానికి అరడజను సినిమాలు థియేటర్స్ లో క్యూ కడుతున్నాయి.
అలానే ఈవారం కూడా ఐదారు సినిమాలు థియేటర్స్ లో విడుదలయ్యాయి. అందులో అల్లు శిరీష్ బడ్డీ, రాజ్ తరుణ్ తిరగబడరా సామి, అలనాటి రామచంద్రులు, విరాజి, యావరేజ్ స్టూడెంట్ నాని, ఉషా పరిణయం థియేటర్స్ లో విడుదలయ్యాయి. సందట్లో సడేమియా అన్నట్టుగా టాప్ హీరోయిన్ త్రిష నటించిన మొదటి వెబ్ సిరీస్ బృంద కూడా గత అర్ధరాత్రి నుంచి సోని లివ్ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చింది.
ఇక ఈ వారం విడుదలైన అల్లు శిరీష్ బడ్డీ చిత్రానికి నడుం కట్టుకుని ప్రమోషన్స్ చేసాడు. ముందుగానే ప్రీమియర్స్ అంటూ పలు నగరాల్లో సందడి చేసాడు. అయినప్పటికి సినిమాపై ఎలాంటి బజ్ క్రియేట్ కాలేదు. అల్లు శిరీష్ సినిమాకి థియేటర్స్ లో పట్టుమని పదిమంది ప్రేక్షకులు కూడా లేరు అంటే నమ్మాలి. ఇక విరాజి, తిరగబడరా సామి, విరాజి, అలనాటి రామచంద్రులు చిత్రాలకు కూడా మినిమమం ఆడియన్స్ లేక పలు చోట్ల షోస్ క్యాన్సిల్ అవడం నిజంగా విచారించదగిన విషయం.
చిన్న సినిమాలను ప్రేక్షకులు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చినా ఆ సినిమాలను థియేటర్స్ లో ఏం చూస్తాంలే.. నెల తిరిగే సరికి ఓటీటీలోకి వచ్చేస్తుంది అనే ధీమాతో ఆడియన్స్ కనిపిస్తున్నారు. అందుకే అనేది థియేటర్స్ కి ఎంత కష్టమొచ్చింది అని.!