మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకు ప్రభాస్ అసలు పెళ్లి చేసుకుంటాడా.. అనే అనుమానం ఆయన అభిమానుల్లో బలంగా మొదలైంది. అటు ఫ్యామిలీ మెంబెర్స్ కూడా తరుచు ప్రభాస్ పెళ్లి పై వస్తున్న ప్రశ్నలను ఏదో విధంగా కవర్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రభాస్ కూడా పెళ్లి విషయాన్ని పక్కనపెట్టి కెరీర్ వెంట పరుగులు పెడుతున్నాడు.
ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ముందు వరసలో ఉన్న ప్రభాస్ తనకొచ్చిన అంత డబ్బుని ఏం చేస్తున్నాడా అనే అనుమానం ఆయన అభిమానుల్లో ఉంది. మొన్నామధ్యన ప్రభాస్ ఇటలీలో ఓ బంగళాను కొనుగోలు చెయ్యడమే కాకుండా అక్కడ ప్రభాస్ వ్యాపారాలు కూడా మొదలు పెట్టడంటూ మాట్లాడుకున్నారు.
అంతేకాదు పాన్ ఇండియా స్టార్ అయ్యాక ప్రభాస్ ముంబై లోను ప్రాపర్టీస్ కొంటున్నాడట. ముంబైలో కొన్ని ఫ్లాటులు కొనుగోలు చేశాడని టాక్. ఇక ఇక్కడ ఒక ఫారెస్ట్ ను దత్తత తీసుకున్న ప్రభాస్ హైదరాబాద్ శివార్లలో ఓ ఫామ్ హౌస్ నిర్మిస్తున్నాడట. ఆ ఫామ్ హౌస్ ను భారీ వ్యయంతో చాలా విలాసవంతంగా కట్టుకుంటున్నాడట. ప్రభాస్ తన అడ్వాన్సులు, పారితోషికాలు ఇలా తెలివిగా బిజినెస్ లో పెట్టడం చూసిన నెటిజెన్స్ ప్రభాస్ ప్లానింగ్ అదిరింది గురు అంటూ కామెంట్ చేస్తున్నారు.