క్రేజీ హీరోయిన్ సమంత అనారోగ్యంతో పోరాటం చెయ్యడమే కాదు.. యాక్షన్ సీన్స్ తోనూ అదరగొట్టేసింది. ఖుషి, సిటాడెల్ వెబ్ సీరీస్ షూటింగ్స్ ఫినిష్ చేసేసి హుటాహుటిన అమెరికా వెళ్లి అక్కడ మాయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే సోషల్ మీడియాలో తరచూ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ అందరిని గ్రిప్ లోనే ఉంచుకున్న సమంత షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చినా సిటాడెల్ హాని బన్నీ వెబ్ సీరీస్ తో ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.
దానికి సంబందించిన టీజర్ విడుదల కాగా.. ఆ టీజర్ లో సమంత యాక్షన్ హైలెట్ అయ్యింది. వరుణ్ ధావన్-సమంత ప్రధానపాత్రల్లో రాబోతున్న సిటాడెల్ హానీ బన్నీ సీరీస్ షూటింగ్ సమయంలో మాయోసైటిస్ తో పోరాడుతూనే సమంత ఎంతగా కష్టపడిందో గుర్తు చేసుకుంటూ హీరో వరుణ్ ధావన్ సమంత పై ప్రశంశల వర్షం కురిపించాడు.
సమంత హెల్త్ ప్రోబ్లెంస్ తో సతమతమైనా ఆమెలో సినిమా అనే ష్యాషన్ మాత్రమే కనిపించింది. ఎలాంటి డిజ్ పాయింట్మెంట్ కి గురి కాకుండా ఆమె వర్క్ చేసింది. అదే మా టీమ్ అందరిలో స్పూర్తిని నింపింది. హెల్త్ పరంగా అనేక ఇబ్బందులు పడినప్పటికీ కఠినమైన యాక్షన్ సన్నివేశాల్లో సమంత ఎంతగా కష్టపడిందో మేము చూసాము.
యాక్షన్ సన్నివేశాలకు ముందు సమంత ప్రాక్టీస్ కూడా అంతే కష్టంగా ఉండేది. అప్పుడప్పుడు సమంతని చూసి నేను ఆశ్చర్యపోయేవాడిని అంటూ సమంత ని, ఆమె కష్టాన్ని వరుణ్ ధావన్ తెగ పొగిడేసాడు.