పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-మహానటి నాగ్ అశ్విన్ ల మ్యాజిక్ కల్కి 2898 AD చిత్రాన్ని 1000 కోట్ల క్లబ్బులో నిలబెట్టింది. మూడు వారాల క్రితం విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తోనే 1000 కోట్లు కొల్లగొట్టడం విశేషంగా చెప్పుకున్నారు. ప్రభాస్ స్టామినా, నార్త్ ఆడియన్స్ లో ఆయన మీదున్న క్రేజ్ అన్ని కల్కి కి పుష్కలంగా కలిసొచ్చాయి.
ప్రస్తుతం కల్కి చిత్రానికి టికెట్ ప్రైస్ కూడా తగ్గించారు. అలా కూడా కలెక్షన్స్ కొల్లగొట్టాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం థియేటర్స్ లో చిన్న సినిమాల తాకిడి ఉండడంతో అది కూడా కల్కి కి కలిసొస్తుంది అని అనుకుంటున్నారు. ఇక కల్కి ఓటీటీ డేట్ పై ఫ్యామిలీ ఆడియన్స్ లో చాలా ఆసక్తి కనిపిస్తుంది.
కల్కి సూపర్ హిట్ అయినప్పటికీ ప్రభాస్ గత సినిమాల వలే నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వస్తుంది అనుకున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ వరకూ దీన్ని తీసుకు రావడంలేదని అన్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని ఆగస్టు 23వ తేదీ నుంచి సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ సిద్ధం అవుతోందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.