దేవర నుంచి అప్ డేట్స్ రావడం అంటూ గోలపెట్టేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మత్తెక్కించే అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. అనిరుద్ రవిచంద్ర మ్యూజిక్ ఆల్బమ్ నుంచి వచ్చిన ఫియర్ సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోగా, ఈసారి తంగం.. అంతరంగ అంటూ బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ రాబోతుంది. దేవర సెకండ్ సింగిల్ ఎంత రొమాంటిక్ గా ఉంటుందో.. దాని అప్ డేట్ పోస్టర్ అంతకన్నా ఎక్కువ రొమాంటిక్ గా ఉంది.
ఎన్టీఆర్-జాన్వీ కపూర్ కలిసి స్క్రీన్ మీద కనిపించే ముందే ఇలాంటి రొమాంటిక్ పోస్టర్స్ బయటికి వస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగుతారా.. దేవర సెకండ్ సింగిల్ రొమాంటిక్ సాంగ్ అంటూ ఎన్టీఆర్-జాన్వీ కపూర్ ల బ్యూటిఫుల్ పిక్ తో అప్ డేట్ అందించారు. గ్లామర్ గర్ల్ జాన్వీ కపూర్ వైట్ కాస్ట్యూమ్ లో ఎన్టీఆర్ కౌగిలిలో కరిగిపోతుందా అనేలాంటి పోస్టర్ అది.
ఎన్టీఆర్ జాన్వీ ని అలవోకగా పట్టుకుని తమకంగా చూస్తున్న దేవర సెకండ్ సింగిల్ పోస్టర్ నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కూల్ చేసేసింది. ఆగష్టు 5 న దేవర సెకండ్ సింగిల్ వదలబోతున్నారు. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సింగిల్ తో రచ్చ రేపడానికి రెడీనా..!