Advertisementt

దేవర.. ఏంటయ్యా అంత నీరసం

Fri 02nd Aug 2024 12:56 PM
ntr fans  దేవర.. ఏంటయ్యా అంత నీరసం
NTR fans worried about Devara దేవర.. ఏంటయ్యా అంత నీరసం
Advertisement
Ads by CJ

దేవర విడుదల కు కౌన్ డౌన్ మొదలైపోయింది. సెప్టెంబర్ 27 న పాన్ ఇండియా రేంజ్ లో దేవర విడుదలకు డేట్ లాక్ చేసారు మేకర్స్.  రెండు నెలల సమయం ఉంది కానీ.. ఇప్పటివరకు ప్రమోషన్స్ పై మేకర్స్ దృష్టి పెట్టకపోవడం పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. పాన్ ఇండియా మూవీ అన్నాక ప్రమోషన్స్ ఎలా చెయ్యాలో కూడా చెప్పాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. 

దేవర సెకండ్ సింగిల్ ఇదిగో అదిగో అప్ డేట్ అంటూ ఊరిస్తున్నారు కానీ.. దేవర సెకండ్ సింగిల్ తంగం అంతరంగం పై ఎలాంటి అప్ డేట్ రాకపోవడంతో దేవర ఏంటయ్యా ఇంత నీరసం అంటూ నెటిజెన్స్ కూడా కామెంట్ చెయ్యడం గమనార్హం. పలువురు దేవర ప్రమోషన్స్ పై పలురకాలుగా నెగెటివ్ స్ప్రెడ్ చేస్తున్నా మేకర్స్ మాత్రం కామ్ గా ఉండడం ఎన్టీఆర్ అభిమానులు భరించలేకపోతున్నారు. 

అనిరుద్ వల్ల లేటవుతుందా లేదంటే మారేదన్నా కారణమో తెలియరావడం లేదు. బాలీవుడ్ లో క్రేజ్ పెంచాలంటే పర్ఫెక్ట్ ప్రమోషన్స్ ఉండాలి, ఇంకా కొరటాల శివ షూటింగ్ మీదే ఉండడమేమిటో, పోస్ట్ ప్రొడక్షన్ కి ఎప్పుడు వెళతారో అని ఫ్యాన్స్ తల పట్టుకుంటున్నారు. మరి మేకర్స్ ఏం ప్లాన్ చేస్తున్నారో.. ఈ మౌనానికి కారణమేమిటో తెలియాల్సి ఉంది. 

NTR fans worried about Devara:

NTR Fans Anxious

Tags:   NTR FANS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ