చంద్రబాబు ను హీరోని చేసింది జగన్ గత ఐదేళ్ల బద్దకమే అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది ఏ టీడీపీ అభిమానులో కాదండోయ్. అక్షరాలా జగన్ అనుకూల బ్లూ మీడియా. 2014 లో ప్రజల్లోకి వెళ్లి వీరుడిలా స్పీచ్ లిచ్చి, పాదయాత్ర చేస్తూ ప్రజాల్లో చైతన్యం తెచ్చి, మీకు నేనున్నాను అని భరోసా ఇచ్చిన జగన్ 2019 అధికారంలోకి రాగానే తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాకుండా ఇంట్లో నుంచి పాలనా చేస్తా అన్నట్టుగా బిహేవ్ చేసారు.
అసలు 2019 లో వైసీపీ కి ప్రజలు కట్టబెట్టిన 155 సీట్లు చూసాక ఇకపై టీడీపీ కోలుకునే ప్రసక్తి లేదు, చంద్రబాబు ఎంతగా కష్టపడినా టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు అనుకున్న వారికి జగన్ తన పాలనలో టీడీపీ కి రెండేళ్లలోనే బలం వచ్చే పనులు చెయ్యడం, చంద్రబాబు ని జైలు కి పంపి కక్ష తీర్చుకోవడం, మంత్రులను మాట్లాడనివ్వకుండా సలహాదారు తో పని కానిచ్చేయడం అన్ని జగన్ చేజేతులా చంద్రబాబు ని హీరోని చేసేలా చేసాయి.
జగన్ నుంచి దూరమైన చాలామంది వాళ్ళు కావాలని వైసీపీ కి దూరం కాలేదు. వాళ్ళను జగన్ దూరం చేసుకున్నాడు. ఇప్పటికి ఓటమి తర్వాత కూడా జగన్ ఇంకా తన కోటరీ పైనే ఆధారపడుతున్నారు, ఒకప్పుడు మీడియా ని పట్టించుకోని జగన్.. ఇప్పుడు కోలుకోవడానికి మీడియానే ఆశ్రయిస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్లలో పథకాలు ఇవ్వలేకపోతే మళ్ళీ అధికారం మాదే అనే ధీమాతో జగన్ ఉంటే.. ఈసారి జగన్ ని ఈ మాత్రం కూడాప్రజలు పట్టించుకోరు.
అధికారం కోల్పోయి చతికిల పడిన చంద్రబాబు కోలుకునే అవకాశం లేదు అన్నారు. కానీ ఆయన్ని తన అధికారంలో రెండేళ్లకే లేపి హీరోని చేసింది జగనే అంటూ వైసీపీ బ్లూ మీడియా జగన్ ని ఇంకా ఇంకా విమర్శిస్తూనే ఉండడం గమనార్హం.