Advertisementt

మిస్టర్ బచ్చన్ కు సిద్దు ట్రీట్

Thu 01st Aug 2024 10:36 PM
siddu jonnalagadda  మిస్టర్ బచ్చన్ కు సిద్దు ట్రీట్
Siddu guest appearance in Mr. Bachchan మిస్టర్ బచ్చన్ కు సిద్దు ట్రీట్
Advertisement
Ads by CJ

ఆగష్టు 15 రేస్ లోకి వచ్చి ఆడియన్స్ అందరిని తమ వైపు తిప్పుకుంటున్న రవితేజ-హరీష్ శంకర్ ల మిస్టర్ బచ్చన్ పై అంచనాలు పెరిగేలా సాంగ్స్ కానివ్వండి, మొన్న విడుదలైన టీజర్ కానివ్వండి ప్రతి అప్ డేట్ ని వదులుతున్నారు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అందాలు ప్రతి అప్ డేట్ లోనే కాదు.. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ లోను హైలెట్ అవడం అందరిలో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. 

ఆగస్టు 15 కి విడుదల కాబోతున్న మరో మూవీ డబుల్ ఇస్మార్ట్ పోటీ తట్టుకునేందుకు దర్శకుడు స్మార్ట్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా మిస్టర్ బచ్చన్ కి హైప్ పెంచే న్యూస్ బయటికి వచ్చింది. ఈ చిత్రం లో టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ గెస్ట్ కేరెక్టర్ చేయబోతున్నాడనే ప్రచారం ఉంది. తాజాగా ఈ చిత్రంలో సిద్దు కేరెక్టర్ కి సంబందించిన ఫైట్ సీన్, క్యామియో కి సంబందించిన షూటింగ్ పూర్తయ్యింది. 

అంటే ఆగష్టు 15 న మిస్టర్ బచ్చన్ రవితేజ తో పాటుగా టిల్లు గాడి హడావిడి కూడా థియేటర్స్ లో చూడబోతున్నారు. మరి ఈ అప్ డేట్ మిస్టర్ బచ్చన్ పై క్రేజ్ పెరగడానికి మరింత బూస్ట్ ఇచ్చినట్టే. 

Siddu guest appearance in Mr. Bachchan:

Siddu Jonnalagadda guest appearance in Ravi Teja Mr. Bachchan

Tags:   SIDDU JONNALAGADDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ