ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ చాలా హడావిడి గా ఉన్నారు. డిప్యూటీ సీఎం గా ఎన్నికయ్యి అసెంబ్లీలో అడుగుపెట్టాక పవన్ కళ్యాణ్ అన్నీ పక్కాగా చక్కబెడుతున్నారు. సీఎం చంద్రబాబు కి సలహాలు సూచనలు ఇస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా హైదరాబాద్ లో అడుగుపెట్టారు.
అంతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలెర్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చేసారు అని సంబరపడిపోతున్నారు. పవన్ హైదరాబాద్ ఏ పని కోసం వచ్చినా ఆయన సినిమాలేమైనా కంప్లీట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారేమో అనే ఆత్రుత పవన్ ఫ్యాన్స్ లో మొదలయ్యింది. సుజిత్ దర్శకత్వంలో OG, అలాగే ఏఎం రత్నం నిర్మాతగా వీరమల్లు పూర్తి చేసేస్తారని వారి ఆశ.
మరి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఎందుకు వచ్చారు అనే విషయం తెలియదు కానీ.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఆయన షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టే క్షణం కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో కానీ, ఆయన నిర్మాతలు మాత్రం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ పవన్ రాక కోసం కాచుకుని కూర్చున్నారు.