ఇప్పటికే పుష్ప ఒకసారి పోస్ట్ పోన్ అయినందుకే అల్లు ఫ్యాన్స్ గింజుకుంటున్నారు. ఆగస్టు 15 స్లాట్ వదులుకుని వాళ్ళు తెగ ఫీలైపోతున్నారు. లాంగ్ వీకెండ్ ని పుష్ప మిస్ చేసుకుంది అంటూ బాధపడుతున్నారు. పోన్లే షూటింగ్ పూర్తవ్వని కారణంగా పుష్ప 2 డిసెంబర్ 6 కి వస్తుంది అనుకుంటే.. ఇప్పుడా డేట్ పై కూడా రకరకాల ప్రచారాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న, వినిపిస్తున్న టాక్ ఏమిటి అంటే పుష్ప 2 కి కొత్త డేట్ రాబోతుంది. డిసెంబర్ 6 నుంచి కూడా సినిమా పోస్ట్ పోన్ అయ్యి వచ్చే ఏడాది మార్చ్ కి వెళ్లబోతుంది అనేది వినిపిస్తుంది. మరి సుకుమార్-అల్లు అర్జున్ ఇద్దరూ ఎడ మొహం పెడ మొహంగా ఉండడమే ఇలా పుష్ప 2 ని ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అవ్వడానికి కారణమంటున్నారు.
ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో సుకుమార్ పుష్ప షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. అల్లు అర్జున్ కూడా ఆగష్టు మొదటివారంలో అంటే ఈ వారం లోనే పుష్ప సెట్స్ లోకి వెళ్లబోతున్నాడు. ఈ షెడ్యూల్ తో పుష్ప షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కాబోతుంది అనే టాక్ ఉంది. అయినప్పటికీ పుష్ప 2 డిసెంబర్ 6 కి రాదనే ప్రచారానికి మాత్రం అడ్డుకట్ట పడడం లేదు.