రాజ్ తరుణ్ నటించిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ థియేటర్స్ లోకి వస్తున్నాయి. గత వారం పురుషోత్తముడిగా వచ్చిన రాజ్ తరుణ్, ఈ వారం తిరగబడరా సామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే రాజ్ తరుణ్ తిరగబడరా సామి ముందుగానే రిలీజ్ డేట్ ఇచ్చారు. ఆ సినిమా ప్రమోషన్స్ కి వెళదామనుకున్న సమయంలో రాజ్ తరుణ్ పై ఆయన ఎక్స్ లవర్ లావణ్య కేసు వెయ్యడం, తిరగబడరా సామి హీరోయిన్ మాల్వి ని కూడా ఇరికించడంతో రాజ్ తరుణ్ సైలెంట్ అయ్యాడు.
రాజ్ తరుణ్-లావణ్య కేసు నడుస్తున్న సమయంలోనే హఠాత్తుగా పురుషోత్తముడు రిలీజ్ డేట్ లాక్ చేసారు మేకర్స్. కానీ లావణ్య ఇష్యుతో రాజ్ తరుణ్ పురుషోత్తముడు ప్రమోషన్స్ ని పక్కనపెట్టేసి ఇంటికే పరిమితమయ్యాడు. కానీ ఈ వారం విడుదల కాబోతున్న తిరగబడరా సామి ని ప్రమోట్ చెయ్యడానికి మీడియా ముందుకు రావడం హాట్ టాపిక్ అయ్యింది.
అదేమిటి రాజ్ తరుణ్ పురుషోత్తముడుని అలా వదిలేసి, తిరగబడరా సామి కోసం ధైర్యం చేసి పర్సనల్ ఇష్యుని కూడా మీడియా ముందు మాట్లాడేందుకు సిద్దమయ్యావు, నీకు పురుషోత్తముడు అంటే లెక్క లేదా.. తిరగబడరా సామీ అంటే ఇష్టమా.. అందుకే మీడియా ముందుకు వచ్చి వ్యక్తిగత విషయాలే కాకుండా సినిమాని ప్రమోట్ చేసుకున్నావ్ అంటూ చాలామంది రాజ్ తరుణ్ ని ప్రశ్నించడం హాట్ టాపిక్ అయ్యింది.