పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆతిథ్యం గురించి ఆయనతో నటించిన హీరోయిన్స్ కానివ్వండి, నటులు కానివ్వండి ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు.. ప్రభాస్ సినిమా సెట్స్ లో ఉంటే రకరకాల ఐటమ్స్ తో టీమ్ అందరికి ప్రభాస్ ఇంటి నుంచి క్యారేజ్ వస్తుంది, అన్ని రకాల నాన్ వెజ్ లతో కూడిన ఆ వంటలు గురించి చెబుతూ వాటిని ఫొటోస్ ల రూపంలో షేర్ చేస్తూ ఉంటారు. సలార్ సమయంలో పృథ్వీ రాజ్ కూతురుకి కావాల్సిన వంటలంతా ఓ గదికి సరిపోయే ఐటమ్స్ ప్రభాస్ పంపించినట్లుగా పృథ్వీ రాజ్ సలార్ ప్రమోషన్స్ లో చెప్పిన విషయం తెలిసిందే. కరీనా, దీపికా ఇలా చాలామంది ప్రభాస్ క్యారేజ్ లపై స్పందించారు.
తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ప్రభాస్ ని ఫాలో అవుతున్నాడనిపిస్తుంది. హీరోయిన్ జాన్వీ కపూర్ ని ఎన్టీఆర్ తన ఇంటి క్యారేజ్ తో సర్ ప్రైజ్ చేసినట్టున్నాడు. ఆ విషయం జాన్వీ కపూర్ పెట్టిన ఇన్స్టా పోస్ట్ చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం దేవర ఫైనల్ షెడ్యూల్ జరుగుతుంది. ఎన్టీఆర్-జాన్వీ కపూర్ అలాగే కీలక నటులపై కొరటాల కీలక సన్నివేశాలు చిత్రీకరణలో ఉన్నారు.
అయితే జాన్వీ కపూర్ మాత్రం తన ఆతిథ్యం విషయంలో సర్ ప్రైజ్ అవుతుంది. అంటే ఎన్టీఆర్ ఇంటి నుంచి ఏమైనా స్పెషల్ వంటకాలతో జాన్వీ ని ఎన్టీఆర్ సర్ ప్రైజ్ చేసాడేమో.. కారణం ఆమె తన ఇన్స్టా లో రకరకాల ఫుడ్ ఐటమ్స్ టేబుల్ మీదున్నట్లుగా షేర్ చేసింది. అందుకే తనకి దేవర సెట్స్ అంటే ఇష్టమని చెబుతుంది.
మరి ఎన్టీఆర్ ఇంటి నుంచి జాన్వీ కపూర్ కి ప్రత్యేకంగా ఫుడ్ వస్తుంది అందుకే జాన్వీ అంతగా సర్ ప్రైజ్ అవుతుంది అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.