జగన్ ప్రభుత్వం సినిమా వాళ్ళను ముఖ్యంగా నిర్మాతలను ఎంతగా ఇబ్బంది పెట్టిందో అందరికి తెలుసు. సినిమా ప్రముఖులను మీటింగ్ కి పిలిచి అవమానించారంటూ ఆయా హీరోల అభిమానులు ఇప్పటికి జగన్ పై ఫైర్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద సినిమాల విడుదల సమయంలో సినిమాలకు స్పెషల్ షోస్ కి పర్మిషన్ ఇవ్వకపోవడమే కాకుండా టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు జగన్ ప్రభుత్వం ఇవ్వలేదు సరికదా ఉన్న టికెట్ రేట్లను తగ్గించడం సినిమా ప్రముఖులకు లోలోపల జగన్ పై కోపం పెరిగిలా చేసింది.
అందుకే జగన్ ఓడిపోయాక సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది జగన్ ప్రభుత్వం పై గుంభనంగా స్పందిస్తే.. మరికొంతమంది జగన్ ఓటమిని పార్టీతో సెలెబ్రేట్ చేసుకున్నారు. తాజాగా ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్యెల్యే కేతి రెడ్డి జగన్ సినిమా ఇండస్ట్రీ పై చూపించిన చిన్న చూపు పై సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. అసలు సినిమా వాళ్ళను కెలకాల్సిన అవసరం జగన్ అన్నకు ఏముంది. టికెట్ రేట్లు తగ్గించడం వల్ల సినిమా ఇండస్ట్రీ నుంచి మన ప్రభుత్వానికి నిష్టూరం తప్ప మరేది లేదు.
తమ అభిమాన హీరో సినిమా వస్తుంది అంటే బ్లాక్ లో టికెట్స్ కొని సినిమా చూస్తారు. అది వాళ్ళిష్టం. నా SC ST BC అంటూ OC లను వదిలేసారు. దాని వలన ఆ వర్గం మనకి యాంటీ అయ్యింది. ఇక నా SC ST BC అన్న వాళ్ళు లబ్ది పొంది కూడా మనల్ని ముంచేశారు. ఫ్యాన్స్ ఎవరైనా హీరోల సినిమాలను ఎంత రేటైనా టికెట్ కొనుక్కుని పోతారు. అలాంటిది నువ్వు టికెట్ రేట్ తగ్గించమని చెబితే ఎలా, అసలు టికెట్ రేటు తగ్గించారనే విషయం చాలామంది ప్రేక్షకులకు కూడా తెలియదు.
టికెట్ రేటు తగ్గించి ఇండస్ట్రీ అందరితో చెడు మూట గట్టుకున్నాం, ఎవరినైతే నెత్తినపెట్టుకున్నారో వాళ్ళైనా మనకు తోడొచ్చారా.. తోడొస్తే మనకి ఈ పరిస్థితి ఉండదు కదా అని జగన్ పై, సినిమా ఇండస్ట్రీ పై కేతి రెడ్డి చేసిన కామెంట్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.