హీరో రాజ్ తరుణ్ ను వదలని లావణ్య, గత పదిహేను రోజులుగా లావణ్య విషయంలో మీడియా కు మొహం చాటేసిన రాజ్ తరుణ్ తన సినిమా ప్రమోషన్స్ కూడా పక్కనపెట్టి సైలెంట్ గా ఇంట్లో కూర్చోవడంతో లావణ్య ఆరోపణలు నిజమే, అందుకే రాజ్ తరుణ్ స్పందించడం లేదు అంటూ అందరూ మాట్లాడుకుంటున్న సమయంలో రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చాడు.
తన మరో సినిమా తిరగబడరా సామి ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న రాజ్ తరుణ్ లావణ్య ఆరోపణలు నిజం కాదు, కావాలంటే నిరూపించుకోమని ఛాలెంజ్ చేసాడు. నిన్న సాయంత్రం తిరగబడరా సామి సినిమా ఈవెంట్ కి రాజ్ తరుణ్ వస్తున్నాడన్న సమాచారంలో లావణ్య రాజ్ తరుణ్ ని కలవనివ్వమంటూ ప్రసాద్ ల్యాబ్ దగ్గర గోల గోల చేసింది.
కానీ లావణ్య ని అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. తన భర్తను కలవడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, రాజ్ తరుణ్ ని కలవనివ్వమని ఆమె చాలా హడావిడి చేసింది. రాజ్ అసలు మాల్వి తో ఎందుకు కలిసి ఉంటున్నాడు. ఇప్పుడు కూడా మాల్వి మల్హోత్రాతో ఎందుకు కలిసి వచ్చాడంటూ నానా హంగామా చేసింది.
రాజ్ తరుణ్ ప్రెస్ మీట్ అనంతరం మాదాపూర్ లోని ఇంటికెళ్ళిపోగా అక్కడ రాజ్ తరుణ్ ఇంటి దగ్గర కూడా లావణ్య రచ్చ చేసింది. గేటు దగ్గర వెయిట్ చేస్తూ రాజ్ ని కలవనివ్వమంటూ గోల చేసింది.