నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు నార్త్ బ్యూటీస్ కి గట్టి పోటీ ఇస్తుంది. యానిమల్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత రష్మిక మందన్న హిందీలో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత సల్మాన్ లాంటి క్రేజీ స్టార్ హీరోతో సికిందర్ లో అవకాశం దక్కించుకుని అందనంత ఎత్తులో నిలబడిన రష్మిక మందన్న ముంబైలో జరిగే ఏ ఈవెంట్ కైనా అద్భుతమైన అందాలు ప్రదర్శిస్తూ తనపైనే ఉండేలా చూసుకుంటుంది.
బాలీవుడ్ సెలబ్రిటీస్ పాల్గొన్న ఇండియా కోచర్ వీక్ ఫ్యాషన్ షో లో రష్మిక మందన్న డిజైనర్ డ్రెస్ లో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. అద్భుతమైన ఔట్ ఫిట్ తో రష్మిక నడుము అందం చూపిస్తూ, క్లీ వేజ్ షో తో చేసిన షోకి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. రష్మిక అందాలవైపే నెటిజెన్స్ చూస్తుండిపోయేలా ఆమె ర్యాంప్ వాక్ చేసింది.
రష్మిక సింగిల్ గానే కాదు యంగ్ హీరో విక్కీ కౌశల్ తో కలిసి రష్మిక ఆ షో లో వాక్ చెయ్యడం హైలెట్ అయ్యింది. విక్కీ కౌశల్ కూడా డిఫరెంట్ ఔట్ ఫిట్ తో రష్మిక మందన్న కి ఏ మాత్రం తగ్గకుండా కలిసి నడిచిన పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.