రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎపుడు గ్లామర్ ఫొటోస్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తూ ఉంటుంది, శారీ కట్టినా, చుడిదార్ వేసినా, మోడ్రెన్ అవుట్ ఫిట్ అయినా, జిమ్ వేర్ అయినా ఎందులో అయినా రకుల్ గ్లామర్ గా అందాలు చూపించడానికి మొగ్గు చూపుతుంది. తాజాగా రకుల్ ప్రీత్ చాలా సింపుల్ లుక్ లో దర్శనమిచ్చింది.
రెడ్ చుడిదార్ లో రకుల్ ప్రీత్ సింగ్ చాలా సింపుల్ గా కనిపించి షాకిచ్చింది. ఎప్పుడు గ్లామర్ తో పోటీపడే రకుల్ ప్రీత్ ఇలాంటి లుక్ షేర్ చేసింది ఏమిటా అనుకుంటున్నారు. రకుల్ ప్రీత్ నవ్వుతూ అలా సరదాగా కనిపించింది. చెవులకు పెద్దపెద్ద జుంకీలు పెట్టుకుని చేతికి వాచ్ తో కాస్త స్టయిలిష్ గా చక్కగా కనిపించింది.
ప్రస్తుతం సౌత్ ని వదిలేసి బాలీవుడ్ లోనే ఉంటూ సినిమాలు చేసుకుంటున్న రకుల్ ప్రీత్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కమ్ నటుడు జాకీ భగ్నానీ ని వివాహం చేసుకున్న తర్వాత కూడా తన కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేదెలే అంటూ రకుల్ ఇలా సోషల్ మీడియా ద్వారా గుర్తు చేస్తుంది.