తెలంగాణ ఎమ్యెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమర్తె కవిత లిక్కర్ కుంభకోణంలో మార్చి 16 నుండి తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. మార్చ్ 16 నుంచి కవిత పలుమార్లు బెయిల్ కి అప్లై చేసింది. కానీ కవితను కోర్టు ప్రతిసారి డిజ్ పాయింట్ చేస్తూనే వచ్చింది. ఈరోజు తో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో ఆమెని వర్చువల్ గా ఈడి అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు.
గతంలో కొడుకు పరీక్షలు బెయిల్ ఇవ్వమని, మద్యలో అనారోగ్యం కారణంగా ఆమెకి బెయిల్ కావాలని కవిత తరుపు న్యాయవాది వాదించినా కోర్టు మాత్రం కవితకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ రోజు కూడా ఢిల్లీలోని హౌస్ అవెన్యూకోర్టు ఎమ్మెల్సీ కవితకు జ్యూడిషియల్ రిమాండ్ ను పొడిగించి మరోసారి షాక్ ఇచ్చింది. ఈడి ఓ వైపు సిబిఐ మరోవైపు కవితను టార్గెట్ చెయ్యడంతో కవిత ఉక్కిరిబిక్కిరి అవుతూనే బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తుంది.
తాజాగా కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను ఆగస్టు 13 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణ కీలక దశలో ఉందని కాబట్టి కవిత రిమాండ్ ను పొడిగించాలని ఈడీ న్యాయస్థానాన్ని అభ్యర్థించడంతో ఈడీ వాదనాలతో ఏకీభవించిన న్యాయస్థానం మళ్లీ కవిత రిమాండ్ ను పొడిగిస్తూ కోర్టు తీర్పిచ్చింది.