Advertisementt

ఆ విషయంలో అల్లు ఫ్యాన్స్ దిగులు

Wed 31st Jul 2024 11:35 AM
pushpa 2  ఆ విషయంలో అల్లు ఫ్యాన్స్ దిగులు
Allu fans are worried about that ఆ విషయంలో అల్లు ఫ్యాన్స్ దిగులు
Advertisement
Ads by CJ

నిజంగా అతిపెద్ద లాంగ్ వీకెండ్ వదులుకున్నందుకు అల్లు అభిమానులు చాలా డిజ్ పాయింట్ అవుతున్నారు. ఆగస్టు 15 కి పుష్ప 2 వచ్చినట్లయితే కలెక్షన్స్ ఊచ కోత జరిగేది.. గురువారం ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే, 16 శ్రావణ శుక్రవారం, శని, ఆది వారాలు వీకెండ్, సోమవారం 19 న రక్షా బంధన్ ఇన్ని హాలిడేస్ ని పుష్ప 2 మిస్ అయ్యింది అంటూ అల్లు ఫ్యాన్స్ చాలా అంటే చాలా దిగులుపడుతున్నారు. 

షూటింగ్ పూర్తి కాని కారణముగా పుష్ప 2 ఆగష్టు 15 నుంచి పోస్ట్ పోన్ అయ్యి డిసెంబర్ 6 న కొత్త తేదీ ప్రకటించారు. ఇప్పుడు డిసెంబర్ 6 పై కూడా నీలి నీడలు కమ్ముకోవడం పై అల్లు ఫ్యాన్స్ దిగులు మరింత ఎక్కువైంది. మరోపక్క సుకుమార్-అల్లు అర్జున్ మద్యన వివాదం సమసిపోయి పనిలోకి దిగిపోయారనే న్యూస్ వినిపిస్తున్నా అల్లు ఫ్యాన్స్ లో ఆగష్టు 15 దిగులు మాత్రం పోవడం లేదు. 

పుష్ప 2 రావడం లేదు అని రామ్-పూరీలు డబుల్ ఇస్మార్ట్ ని దించితే.. అనుకోకుండా హఠాత్తుగా హరీష్-రవితేజ ల మిస్టర్ బచ్చన్ అదే ఆగష్టు 15 కి కచ్చిఫ్ వెయ్యడంపై ఇప్పుడు ఆయా మేకర్స్ మద్యన మాటల యుద్ధం జరుతుంది. మరి ఈ రెండు క్రేజీ సినిమాల నడుమ నార్ని నితిన్ ఆయ్ కూడా అదే ఆగస్టు 15 న విడుదలకు సిద్ధమైంది. మరి ఈ మూడు సినిమాలకు ఆ లాంగ్ వీకెండ్ బాగా కాలిసి రావడం పక్కా..!

Allu fans are worried about that:

Pushpa 2 who missed August 15

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ