Advertisementt

ప్రకృతి విలయతాండవం

Wed 31st Jul 2024 11:16 AM
wayanad  ప్రకృతి విలయతాండవం
Prakriti vilayatandavam ప్రకృతి విలయతాండవం
Advertisement

నిత్యం వేలాదిమంది రోడ్ యాక్సిడెంట్స్ కారణంగానో, లేదంటే ఇతర అనారోగ్య సమస్యలతో, కాదు అంటే బలవన్మరణాలతో మరణానికి దగ్గరవడం అనేది పరిపాటే. కానీ ప్రకృతి కోపానికి బలి కావడమనేది మాత్రం నిజంగా విషాదకరమే. ప్రకృతి విలయతాండవం సృష్టిస్తే ఎలా ఉంటుందో కేరళలోని వాయనాడ్ ని చూస్తే అర్ధమవుతుంది. మానవ తప్పిదాలో, లేదంటే ఏనాటి ఖర్మో.. ఊర్లు ఊర్లె లేకుండా మట్టికొట్టుకుపోవడం అనేది నిజంగా విచారించదగిన విషయం. 

2018 కేరళ వరదలు ఒక ఎత్తు. ఇప్పుడు కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి అనేకమంది మృతి చెందడమనేది ఎంతో దురదృష్టమని చెప్పాలి. కుండపోత వాన, వరదలు, పక్కనే ఉన్న కొండల నుంచి మట్టి, రాళ్ళూ ఊరు మీద పడి అందులోని ప్రజలను తన మట్టిలో కలిపేసుకోవడమనేది మాటల్లో వర్ణించలేనిది. ప్రకృతి ఆగ్రహిస్తే ఇలాంటి విషాదకర సంఘటనలే జరుగుతాయనడానికి కేరళలోని వాయనాడ్ ఉదాహరణగా మిగిలిపోతుంది. 

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వాయనాడ్ లో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలు. తమ వారిని కోల్పోయి అనాధల్లా మిగిలిన వారి బాధ వర్ణనాతీతం. తమ వారి కోసం వారు పిలుస్తున్న పిలుపులు చూసిన వారిని కన్నీళ్లు ఆగవు. వాయనాడ్ చుట్టుపక్కల ముండక్కై, చూరల్‌మల, అట్టామల, నూల్‌పుజా గ్రామాలలో ఈ తరహా దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

వాయనాడ్ లో కొండచరియలు విరిగి పడడంతో అక్కడ గ్రామాలకు గ్రామాలు శిథిలాల కింద సమాధి అయ్యాయి. ఇంకా ఎంతమంది మృత్యువాత పడ్డారో అనేది చెప్పడం కూడా కష్టంగా మారింది. 

Prakriti vilayatandavam:

>Wayanad Landslides updates: death toll rises to 150

Tags:   WAYANAD
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement