Advertisementt

దేవర సెకండ్ సింగిల్ తంగం అంతరంగం

Tue 30th Jul 2024 08:32 PM
devara  దేవర సెకండ్ సింగిల్ తంగం అంతరంగం
Devara second single update దేవర సెకండ్ సింగిల్ తంగం అంతరంగం
Advertisement
Ads by CJ

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత కొరటాల దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్నారు. సెప్టెంబర్ 27 న విడుదల కాబోతున్న దేవర చిత్రం నుంచి ఏ అప్ డేట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇప్పటికే దేవర కి మ్యూజిక్ అందిస్తున్న అనిరుద్ మ్యూజిక్ ఆల్బమ్ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఇంప్రెస్ చేసింది. 

ఇక ఆ తర్వాత నుంచి దేవర తదుపరి అప్ డేట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. కొద్దిరోజులుగా దేవర సెకండ్ సింగల్ అప్ డేట్ అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్నారు. తాజాగా దేవర సెకండ్ సింగిల్ తంగం అంతరంగం హాయిగా ఉయ్యాల ఊగుతున్నట్లు ఉంటుంది ఆ పాట.. ఇప్పుడే విన్నా అతి త్వరలోనే ఈ సాంగ్‌ వచ్చేస్తుంది అంటూ రామజోగయ్య శాస్త్రి గారు వేసిన ట్వీట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆత్రుత, ఆరాటం మొదలైపోయింది. 

దేవర చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఆమె పాత్ర పేరు తంగం.. సో తంగం కేరెక్టర్ పై వస్తున్న ఈపాటలో ఎన్టీఆర్-జాన్వీ కపూర్ కలిసి డాన్స్ చేసిన విజువల్స్ ఎలా ఉండబోతున్నాయో అని ఎన్టీఆర్ అభిమానులైతే తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ పాట లో ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ లు రొమాంటిక్ డాన్స్‌ తో అదరగొట్టబోతున్నారు అనే టాక్ మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని నిలవనియ్యడం లేదు. 

Devara second single update :

Devara second single Thangam antharangam on the way

Tags:   DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ